అక్కినేని నాగార్జున కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కొన్ని సంవత్సరాలు దాటిపోతున్నా హీరోగా సెటిల్ కాలేకపోతున్నాడు. ‘ఏజెంట్’ విడుదలై దాదాపు 16 నెలలు దాటిపోతున్నా అఖిల్ తన కొత్త సినిమాను ప్రారంభించే సాహసం చేయలేకపోతున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నప్పటికీ ఏసినిమా ముందు ప్రారంభించాలి అన్న విషయమై అఖిల్ పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అన్న గాసిప్పులు వినిపిస్తున్నాయి.



ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అనిల్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ధీర’ అనే ఫ్యాంటసీ మూవీని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటిదాకా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు. హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం ఈ మూవీ బడ్జెట్ అంచనాలకు మించిపోవడంతో అఖిల్ కు ఉన్న మార్కెట్ రీత్యా ఇంత బడ్జెట్ పెట్టడం విషయమై ఇంకా ఆలోచనలు కొనసాగుతున్న నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాలేదు అని అంటున్నారు.



ఇది ఇలా ఉండగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు మురళీ కృష్ణ అన్నపూర్ణ సంస్థ టీమ్ కు చెప్పిన కథ వారికి బాగా నచ్చింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘లెనిన్’ అన్న టైటిల్ కూడ ఫిక్స్ అయినట్లు టాక్. అయితే అఖిల్ ‘ధీర’ సినిమా కోసం జుత్తు గెడ్డం బాగా పెంచిన నేపధ్యంలో ఇప్పుడు అదే లుక్ తో ‘లెనిన్’ సినిమాలో అఖిల్ కనిపిస్తాడా అన్న సందేహాలు కొందరు వ్యక్తపరుస్తున్నారు.



ఇప్పటివరకు అఖిల్ రకరకాల ప్రయోగాలు తన సినిమాల విషయంలో చేసినప్పటికీ ఏప్రయోగం సక్సస్ కాకపోవడంతో అక్కినేని కాంపౌండ్ సపోర్ట్ ఉన్నప్పటికీ అఖిల్ సెటిల్ కాలేకపోతున్నాడు. అందమైన లుక్ తో పాటు నేటి యూత్ కు నచ్చేవిధంగా డాన్స్ చేయగల సమర్థత అఖిల్ కు ఉన్నప్పటికీ తన సినిమాల ఎంపిక విషయంలో ఈ అక్కినేని వారసుడు తన కన్ఫ్యూజన్ లో కొనసాగుతూనే ఉన్నాడు..  



మరింత సమాచారం తెలుసుకోండి: