టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతారు. అలాంటి వారిలో సంయుక్త మీనన్ ఒకరు. 2016లో మలయాళ చిత్రం పాప్ కార్న్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. 2002లో విడుదలైన భీమ్లా నాయక్ సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైన సంయుక్త ఆ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.


తర్వాత బింబిసారా సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ధనుష్ సరసన సార్ సినిమాలో హీరోయిన్గా నటించి మెప్పించింది. సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్షా సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకులను భయపెట్టింది ఈ భామ. ప్రస్తుతం సంయుక్త స్వయంభు సినిమాలో నిఖిల్ సరసన హీరోయిన్గా చేస్తోంది. ప్రస్తుతం సంయుక్త చేతిలో దాదాపు నాలుగైదు సినిమాలకుపైనే ఉన్నాయి.



ఎప్పుడూ వరుస సినిమాలతో బిజీగా ఉండే సంయుక్త సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు వరుసగా ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా..... ప్రస్తుతం సంయుక్తకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.


తమిళ నటుడితో సంయుక్త ప్రేమాయణం కొనసాగిస్తుందని ఓ వార్త వైరల్ అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లు ఇండస్ట్రీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఆ నటుడు ఎవరు, ఏంటి అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: