సాధారణంగా రీమిక్స్ సినిమాలు చేయడం అనేది కొన్ని ఇండస్ట్రీలో సర్వసాధారణంగా మారిపోయింది ఒక ఇండస్ట్రీలో భారీ హీట్ కొట్టిన సినిమాలను ఇతర భాషలలో కూడా రీమిక్స్ చేసి చాలా మంది హీరోలు సక్సెస్ అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ మరి కొంతమంది హీరోలు ఫ్లాప్లుగా అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే డైరెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఇలా కొన్నిసార్లు దెబ్బ పడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక సినిమా మాత్రం మూడు భాషలలో రీమిక్స్ చేసి మంచి విజయాన్ని అందించగా తెలుగులో మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయిందట.


సినిమా ఏంటి కాదు బాడీగార్డ్.. మలయాళం లో 2010లో వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ ని అందుకుంది. డైరెక్టర్ సిద్ధికి ఈ చిత్రాన్ని తెరకెక్కించి భారీ క్రేజ్ అందుకున్నారు. తమిళంలో మాత్రం విజయ్, ఆసీన్ తో ఈ సినిమాని రీమేక్ చేసి 100 కోట్లను కొల్లగొట్టారు. రజనీకాంత్ నటించిన శివాజీ, రోబో ల తర్వాత మళ్లీ అంతటి స్థానాన్ని అందుకుంది ఈ చిత్రం. ఈ సినిమా తమిళంలో విడుదలైన తర్వాత 7 నెలలకి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ సినిమాలో నటించారు.ఈ సినిమా కూడా అక్కడ పలు రికార్డులను సృష్టించింది.


హిందీలో ఫాస్ట్ గా 100 కోట్లు నిలిచిన చిత్రంగా రికార్డు సృష్టించింది. సుమారుగా 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిందట.ఇక తెలుగులో విషయానికి వస్తే వెంకటేష్ ఈ చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో తెరకెక్కించారు.కానీ ఇక్కడ మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. వెంకటేష్ కెరియర్ లోనే ఈ చిత్రం ఒక మచ్చగా మిగిలిపోయింది ఇలా మూడు భాషలలో భారీ హీట్ అయిన బాడీగార్డ్ చిత్రం తెలుగులో మాత్రం సక్సెస్ కాలేక డిజాస్టర్ గానీ మిగిలిపోయింది. అయితే ఇందులో వెంకటేష్ యాక్టింగ్ ఈ సినిమాకి సరిపోలేదని రూమర్స్ వినిపించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: