కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, వెంకట ప్ర‌భు కాంబినేషన్లో ఈ వారం వస్తున్న సినిమా గోట్. వెంకట్‌ ప్రభు మంచి దర్శకుడు. మంచి సబ్జెక్టు ఉంది. కానీ.. కమర్షియల్ గా సక్సెస్ రేట్ చాలా తక్కువ. అయితే ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్ హక్కులను రూ.22 కోట్లకు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్. ఏపీ, తెలంగాణ కలిపి రూ.22 కోట్లు అంటే చాలా ఎక్కువ. పైగా విజయ్‌కు తెలుగులో అంత మార్కెట్ లేదు. అయితే మైత్రి మూవీ మేక‌ర్స్‌.. భారీ రిస్క్ చేయడం వెనక చాలా లెక్కలు ఉన్నాయి. రిటర్న్ చేసే అడ్వాన్స్ లెక్కలోనే కనుక.. మైత్రి వాళ్ళు టెన్షన్ పడాల్సిన పనిలేదు. విషయం ఏంటంటే.. అసలు ఈ రేంజ్ లో సినిమా పెర్ఫార్మ్ చేస్తుందా.. లేదా.. అన్నదే డౌట్.


ఏపీ, తెలంగాణ స్టేట్ కలిపి రూ.22 కోట్ల మేరకు వసూళ్ళు చేయాలంటే సినిమా చాలా పెద్ద హిట్ కొట్టాల్సి ఉంటుంది. అంతకన్నా ముందు మంచి ఓపెనింగ్‌ పడాలి. ఇప్పటికే థియేటర్లలో నాని నటించిన సరిపోదా శనివారం మూవీ ఉంది. మరో మూడు ప్రామిసింగ్‌ సినిమాలు గోట్‌తో పాటు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని గోట్ వ‌సూళ్లు సాధించాలి. గోట్‌కు తెలుగు నాట సమస్య ఏంటంటే.. పెద్దగా పబ్లిసిటీ కూడా లేదు. ఈ సినిమా టీం కేవలం తమిళనాట ప్రచారం చేయడంతోనే సరిపెట్టేసింది. ఇక్కడ అస్సలు పట్టించుకోలేదు. ఇక విజయ్ కూడా ముందు నుంచి తన సినిమాలు తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడే తప్ప.. ఇక్కడ అస్సలు పబ్లిసిటీ చేయటం లేదు.


విజయ్‌కు తెలుగు మార్కెట్ కావాలి. తెలుగు నుంచి తన సినిమాలకు డబ్బులు రావాలి తప్ప.. ఇక్కడ ప్రచారం చేయడు. పబ్లిసిటీ చేయడు. ఎవరిని పట్టించుకోరు. తెలుగు వాళ్ళు అంటే విజయ్‌కు చాలా చిన్న చూపు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. కనీసం తన కెరీర్‌లో చివరి సినిమా అని ప్రచారం జరుగుతున్న గోట్‌.. తెలుగు దర్శనకు కూడా ప్రమోషన్ చేయలేదు. జస్ట్ టీమ్ వచ్చి హడావిడి చేసి వెళ్ళింది. కానీ అది జనానికి రీచ్ కాలేదు. కనీసం రెండు మూడు వారాల ముందు నుంచి హడావుడి చేసి ఉంటే వేరుగా ఉండేది. పైగా గోట్‌ టైటిల్ కూడా కాస్త వీక్ అయ్యిన‌టు వినిపిస్తోంది. అందువల్ల ఈ సినిమా తెలుగులో రూ.22 కోట్ల స్టేట్ టార్గెట్ రీచ్ అవుతుందా.. లేదా.. అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: