ఒకప్పుడు టాలీవుడ్‌లో శ్రీనువైట్ల అంటే కామెడీ యాక్షన్ సినిమాలకు ఒక బ్రాండ్ కామెడీ సన్నివేశాలతో పొట్ట చెక్కులు చేస్తూనే మాస్ ప్రేక్షకులకు అవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాను తెరకెక్కించి సూపర్ డూపర్ హిట్లు కొట్టడం శ్రీనువైట్ల స్టైల్. కానీ.. శ్రీను వైట్ల రిపీట్ గా అదే తరహా సినిమాలు చేస్తూ రావడంతో ఒక టైం లో ఆ జానెర్ అవుట్ డేటెడ్ గా మారిపోయింది. దీనికి తోడు బుల్లితెరపై జబర్దస్త్ స్కిట్‌లు, కామెడీ స్కిట్‌లు ఎక్కువగా వస్తూ ఉండటంతో.. శ్రీను వైట్ల ఔట్‌ డేటెడ్ అయిపోయాడు. ఆగడు సినిమా నుంచి శ్రీనువైట్లకి డేంజర బెల్స్ మొదలయ్యాయి. కానీ.. ఈ సీనియర్ డైరెక్టర్ ఆ విషయం గమనించలేదు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో బ్రూస్లీ, వరుణ్ తేజ్ తో మిస్టర్, రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ లాంటి డిజాస్టర్లు తీశాడు.


ఈ వరుస ప్రాజెక్ట్‌లతో శ్రీను వైట్ల కెరీర్ డేంజర్‌లో పడే పరిస్థితి ఏర్పడింది. ఓ విధంగా చెప్పాలంటే శ్రీనివాస్ కోసం ఒకప్పుడు స్టార్ హీరోలు సైతం క్యూలో ఉండేవారు. ఇప్పుడు స్టార్ హీరోలు కనీసం కథ‌ కూడా వినని పరిస్థితి. మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు శ్రీనువైట్ల సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చారు. శ్రీను వైట నుంచి సినిమా వచ్చి ఆరేళ్లు అవుతుంది. చివరగా శ్రీను.. తెర‌కెక్కించిన సినిమా అమర్ అక్బర్ ఆంటోనీ 2018 లో రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని శ్రీనువైట్ల.. గోపీచంద్‌తో విశ్వం అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అవుతుంది. రీసెంట్గా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ లో శ్రీను వైట్ల స్టైల్ లో కామెడీ యాక్షన్ మిక్స్ చేసి ఉండటం ఆకట్టుకుంటుంది.


అయితే కొంతమంది నెట్లో టీజర్ పై ఆసక్తికర కామెంట్లు కూడా చేస్తున్నారు. విశ్వం టీజర్ లో రవితేజ.. వెంకీ, మహేష్ బాబు.. దూకుడు, ఆగడు సినిమాలో ఛాయ‌లు కనిపిస్తున్నాయంటున్నారు. వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ని ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సన్నివేశం స్ఫూర్తితోనే విశ్వంలో కూడా ట్రైన్ సీన్లు పెట్టినట్లు ఉన్నారు. ఈ సీన్ లో బీట్‌, జైలర్, భగవంత్ కేసరి సినిమాలతో పాపులర్ అయిన కమెడియన్ వీటి గణేష్ కూడా ఉన్నారు. ట్రైన్ ఎపిసోడ్లో ఆయన టీసీగా కనిపిస్తున్నారు. ఇక ఆగడు, దూకుడు సినిమాలను పోలిన సన్నివేశాలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా శ్రీ‌నువైట్ల.. వెంకీ, దూకుడు, ఆగడు సినిమాలను మిక్స్ చేస్తే చేశారు. కానీ.. గోపీచంద్‌కు హిట్టు ఇస్తే చాలు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: