తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హరీష్ శంకర్ ఒకరు. ఈయన రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్గా రూపొందిన షాక్ అనే మూవీ తో దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత రవితేజ హీరోగా మిరపకాయ్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఈ దర్శకుడు పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో హరీష్ శంకర్ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది.

ఇంత గొప్ప విజయం సాధించిన ఈ మూవీ ని సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ కి ప్రేక్షకుల నుండి నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" మూవీ రిలీజ్ కు ముందు జరిగిన ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. హరీష్ శంకర్ తాజాగా మాట్లాడుతూ ... గబ్బర్ సింగ్ మూవీ ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయింది. దాదాపు వారం రోజుల్లో విడుదల అనే సమయంలో డబ్బింగ్ లో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే నేను డబ్బింగ్ థియేటర్లో ఆ కరెక్షన్స్ చేపిస్తున్నాను. ఇక ఆ టైమ్ లో నేను సౌండ్ ఇంజనీర్ మాత్రమే అక్కడ ఉన్నాము. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చారు.

వచ్చి కొన్ని సీన్స్ చూపిస్తావా అని అడిగారు. వెంటనే నేను పవన్ కళ్యాణ్ గారిని డబ్బింగ్ రూమ్ లోకి పంపించి , నేను సౌండ్ ఇంజనీర్ బయట ఉన్నాము. ఇక పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ చూశారు. చూసి బయటకు వచ్చాడు. వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. చాలా రోజుల నుండి నా ఫ్యాన్స్ నా నుంచి ఒక బ్లాక్ బాస్టర్ కోసం అడురు చూస్తున్నారు. అది ఈ సినిమా అవుతుంది అని చెప్పాడు. అదే జరిగింది అని హరీష్ శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: