సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న పాత్రను మరొకరితో తెరకెక్కించడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఒక పాత్రలో ఒకరిని అనుకున్న తర్వాత అందులో వేరే వాళ్ళు నటించినట్లు అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లేక ఆ పాత్రకు అద్భుతమైన గుర్తింపు వచ్చిన మిస్ చేసుకున్న వారు ఆ సినిమాను చేసి ఉంటే బాగుండుంది అనుకుంటారు. ఇక అదే సినిమా ఫ్లాప్ అయిన ఆ మూవీ లోని ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాకపోయినా ఆ రోజు ఆ మూవీ ని రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేసాం అనుకుంటూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మనులలో రష్మిక మందన , పూజా హెగ్డే ఉంటారు.

కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఒక సినిమా ఆఫర్ మొదటగా రష్మిక మందన కు రాగా , దానిని ఆమె రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ సినిమాను పూజ హెగ్డే ఓకే చేసింది. దాని ద్వారా ఆమెకు ఫ్లాప్ వచ్చింది. ఆ సినిమా ఏది అనే వివరాలను తెలుసుకుందాం. కొంత కాలం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

మూవీ లో రామ్ చరణ్ కు జోడిగా పూజ హెగ్డే నటించింది. ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా మొదట పూజా హెగ్డే ను కాకుండా రష్మిక మందన ను అనుకున్నారట. అందులో భాగంగా ఈమెకు కథను కూడా వివరించగా ఆ సమయంలో వేరే సినిమాతో బిజీగా ఉండడంతో ఈ బ్యూటీ నేను చేయలేను అని చెప్పిందట. దానితో పూజా హెగ్డే ఈ కథను చెప్పగా ఆమె ఓకే చేసిందట. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలా ఆచార్య మూవీ నుండి రష్మిక తప్పించుకుంటే పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా చేసి అపజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: