కోలీవుడ్ నటుడు తలపతి విజయ్ ఆఖరుగా నటించిన 7 సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

తలపతి విజయ్ తాజాగా ది గోట్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ రేపు అనగా సెప్టెంబర్ 5 వ తేదీన థియేటర్లో విడుదల కానుంది. ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 12 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది.

కొంత కాలం క్రితం విజయ్ లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా , లోకేష్ కనకరాజు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందిన వారసుడు సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.

విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 10 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ హీరోగా మాళవిక మోహన్ హీరోయిన్ గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన మాస్టర్ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ హీరోగా నయన తార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో రూపొందిన విజిల్ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో 10.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

విజయ్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన సర్కార్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: