మ్యాచో స్టార్ గా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తెలుగు చిత్ర సీమ పరిశ్రమలో హీరోగా మంచి మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. అయితే అలాంటి గోపీచంద్ హీరోగా చేసిన ఓ సినిమాలో నటించిన హీరోయిన్ తో అల్లరి నరేష్ అఫైర్ పెట్టుకున్నాడు అంటూ అప్పట్లో మీడియా మొత్తం కోడై కూసింది. మరి ఆ హీరోయిన్ ఎవరు.. నిజంగానే అల్లు నరేష్హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారా అనేది ఇప్పుడు చూద్దాం.. గోపీచంద్ హీరోగా చేసిన రణం సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో కామ్నా జెట్మిలాని హీరోయిన్ గా నటించింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని చూస్తుంది.

 అయితే అలాంటి కామ్నా జెట్మిలానితో అల్లరి నరేష్ అప్పట్లో ఎఫైర్ నడిపించారనే టాక్ వినిపించింది.. మరి అప్పట్లో చక్కర్లు కొట్టిన న్యూస్ లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. అల్లరి నరేష్ హీరోగా చేసిన కత్తి కాంతారావు, బెండు అప్పారావు, యాక్షన్ 3d వంటి సినిమాల్లో కామ్నా జెట్మిలాని హీరోయిన్ గా నటించింది.అలా వరుసగా మూడు సినిమాల్లో అల్లరి నరేష్ కామ్నా జెట్మిలాని కలిసి నటించేసరికి వీరిద్దరి మధ్య ఎఫైర్ వార్తలు ఫిలిం సర్కిల్స్లో తెగ చక్కర్లు కొట్టాయి.. అయితే అల్లరి నరేష్ కి కామ్నా జెట్మిలాని కంటే ముందే ఫర్జానాతో కూడా ఎఫైర్ పెట్టుకున్నట్టు వార్తలు వినిపించాయి.

కానీ ఫర్జానా పెళ్లి చేసుకోవడంతో ఈ వార్తలు ఆగిపోయాయి.ఇక ఎప్పుడైతే కామ్నా జెట్మిలాని,అల్లరి నరేష్ మధ్య ఎఫైర్ వార్తలు వినిపించాయో ఆ తర్వాత వెంటనే ఈ వార్తలకు పులిస్టాప్ పెట్టడానికి కామ్నా జెట్మిలాని సూరజ్ నాగ్ పాల్ అనే వ్యక్తిని పెళ్లాడింది. వీరి పెళ్లి 2014లో జరిగింది. ఇక కామ్నా జెట్మిలాని పెళ్లి చేసుకున్న సంవత్సరానికే అల్లరి నరేష్ కూడా విరూప ని పెళ్లాడారు.అలా అల్లరి నరేష్ కామ్నా జెట్మిలాని ఎఫైర్ వార్తలు వీరి పెళ్లిళ్లతో పులిస్టాప్ పడిపోయాయి. ఏది ఏమైనప్పటికీ ఈ రంగుల ప్రపంచంలో రాణించాలంటే ఇలాంటి ఎఫైర్ వార్తలను ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: