టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన దర్శకుడిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ నీ కొనసాగించిన వారిలో బి గోపాల్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ , ఇండస్ట్రీ హిట్ మూవీలకి దర్శకత్వం వహించాడు. అలాగే కొన్ని ఫ్లాప్ మూవీలకు కూడా ఈయన దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయన దర్శకత్వంలో రూపొందిన రెండు సినిమాలు కేవలం వారం వ్యవధిలోనే విడుదల అయ్యాయి. అందులో ఒక సినిమా భారీ అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా , మరో సినిమా ఏకంగా టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా బి గోపాల్ "అల్లరి రాముడు" అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ 2002 వ సంవత్సరం జూలై 18 వ తేదీన మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ సినిమా ఆపజయాన్ని అందుకుంది. బి గోపాల్ , మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్ , సోనాలి బింద్రే హీరోయిన్ లుగా ఇంద్ర అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ 2002 వ సంవత్సరం జూలై 24 వ తేదీన భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని అప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్ లను వసూలు చేసి ఆల్ టైమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా బి గోపాల్ దర్శకత్వంలో రూపొందిన అల్లరి రాముడు , ఇంద్ర సినిమాలు కేవలం ఒక వారం వ్యవధిలో విడుదల కాగా ఇందులో అల్లరి రాముడు మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఇంద్ర మూవీ టాలీవుడ్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: