ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వరదల కారణంగా చాలా నష్టపోయారు ప్రజలు. వారిని ఆదుకునేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. అయితే వారికి ఆసరాగా నిలిచేందుకు పలువురు సినీ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి టాలీవుడ్ స్టార్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు చేరిపోయారు. "రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా, నేను ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటికి సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షల రూపాయల విరాళం ఇస్తున్నాను.
వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి మరియు పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చెయ్యడానికి సంబంధిత ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఆ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి, మరింత బలంగా ఎదగాలి" ఆనీ పేర్కొన్నారు. మహేష్ చేసిన ఈ సహాయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా కానీ ఇలాంటి వాళ్లకి సహాయం చేయండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కాబట్టి తెలంగాణ, ఆంధ్రాలో వరదల కారణంగా చాలా కుటుంబాలు నాశనం అయిన సంగతి తెలిసిందే. అలా అయినవారికి మనకి తోచినంత సహాయం చేద్దాం అని మహేష్ బాబు ముందుకి వచ్చాడు. మహేష్ బాబు ఏ కాకుండా కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా సహాయం చేశారు.