మలయాళ సినీ ఇండస్ట్రీలో హేమ కమిటీ ఒక సంచలనంగా మారిపోయింది.. ఇప్పటికే చాలామంది నటీమణులు సైతం సీనియర్ నటుల పైన కొంతమంది డైరెక్టర్ల పైన నిర్మాతలపైన పలు విషయాలను తెలియజేయడంతో హేమ కమిటీ నుంచి రోజుకు ఒక పేరు వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ నటి రేఖా నాయర్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇది మాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్నదని తెలిపింది. మీడియా లేని కాలంలో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయని కానీ చాలామంది అప్పట్లో సర్దుకుని పోయేవారని తెలిపింది. అలా పోకపోతే అవకాశాలు రావని బెదిరించేవారట.


కోలీవుడ్ లో ఇలాంటి వేధింపులు అన్ని ఇండస్ట్రీలో కంటే ఎక్కువగా జరుగుతున్నాయని రేఖ నాయక్ పలు రకాల ఆరోపణలు చేస్తోంది. మలయాళం ఇండస్ట్రీలో కేవలం 10 నుంచి 20 మంది మాత్రమే ఉండి ఉంటే కానీ తమిళ ఇండస్ట్రీలో ఏకంగా 500 మందికి పైగా ఉంటారని తెలియజేసింది. ఇవన్నీ బయట పెడితే ఎక్కడ ఛాన్సులు రావని చాలామంది బయటపెట్టలేదని రేఖా నాయక్ వెల్లడించింది. అందుకే హీరోయిన్స్ వీటి గురించి ఎక్కడా కూడా మాట్లాడాలని భయపడతారని తెలియజేసింది.


తమిళ సినిమా సంఘాలకు లైంగిక వేధింపుల పైన ఫిర్యాదు చేసిన అసలు పట్టించుకోరని కేవలం మలయాలం తమిళం మాత్రమే కాదు అన్ని భాషలలో మహిళలపై వేధింపులు జరుగుతున్నాయి అంటూ తెలిపింది. టీవీ సీరియల్స్ ద్వారా తమిళంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రేఖా నాయర్.. పగల్ నిలువు, ఆమె వంశం, బాల గణపతి వంటి సీరియల్స్ లో కూడా నటించినది. అలాగే బిగ్ బాస్-7 లో కూడా కన్సిస్టెంట్ గా పాల్గొన్నదట. గతంలో కూడ ఈమె మహిళల పైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది అమ్మాయిల నడుము పై చేయి వేసి అబ్బాయిలు ఎంజాయ్ చేయాలి కానీ ఏదో అయిపోతుందని హంగామా చేయకూడదని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: