ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండటంతో స్టార్ హీరోలు ఒకరిని చూసి మరొకరు తమ హిట్ సినిమాలను మరోసారి 4కే వెర్షన్‌లో అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఖుషి, మురారి, పోకిరి, ఇంద్ర సినిమాలు రీ రిలీజ్‌లోనూ మంచి వసూళ్లు సాధించడంతో ఈ కోవలో మరిన్ని చిత్రాలు వస్తాయని భావిస్తున్నారు. హీరోల బర్త్ డేలు, లేదంటే ఆయా హిట్ చిత్రాల ల్యాండ్ మార్క్ ఇయర్స్‌ను పురస్కరించుకుని రీరిలీజ్‌లతో దిగుతున్నారు. దాదాపు పన్నెండేళ్ల తర్వాత  పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’ రీ రిలీజ్ అయ్యింది. దీంతో థియేటర్స్ లో పవన్ మేనియా

 మామూలుగా లేదు. ఫ్యాన్స్ తెర పై మరోసారి వింటేజ్ పవన్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ఏళ్ళు గడిచిన పవన్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతూనే ఉంది. ఖుషీ తర్వాత మళ్ళీ దాదాపు పదేళ్ల తర్వాత పవన్ స్థాయికి తగ్గ హిట్ గబ్బర్ సింగ్ తో పడింది. 2012 లో ఈ సినిమా విడుదలైనప్పుడు పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ సినిమాలో పవన్ డైలాగ్స్, మ్యానరిజమ్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ కు పిచ్చెకించాయి.ఇక 12 ఏళ్ళ తర్వాత కూడా ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవల రీ రిలీజైన ఈ మూవీని పవన్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమాలోని

 అంత్యాక్షరీ సీన్ లో పాటలకు స్టెప్పులేస్తూ థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు.  గబ్బర్ సింగ్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర ప్రాంతాల్లో అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ చేశారు. గబ్బర్ సింగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 8.02 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రీ రిలీజ్ చిత్రంగా మహేష్ బాబు నటించిన మురారీ పేరిట రికార్డు ఉండేది. ఆ రికార్డును ప్రస్తుతం గబ్బర్ సింగ్ తుడిచిపెట్టేసింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: