తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నాచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన సరిపోదా శనివారం సినిమా సక్సెస్‌ ను ఎంజాయ్ చేస్తున్న నాని మరో సారి అభిమానులకి ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పవచ్చు. ఇక నాని తన కెరీర్ లో 32 వ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా కి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయడానికి నాని సిద్ధం అయ్యాడు.  దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్ సెప్టెంబర్ 5న ఉదయం 11.04 గంటలకు చేయబోతున్నట్లు నాని తెలిపాడు.

దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో రక్తం మరకలతో ఉన్న చేతితో కారు స్టీరింగ్‌ను పట్టుకొని ఉన్న ఈ పోస్టర్మూవీ పై అభిమానులలో భారీ ఆసక్తిని రేపుతోంది. ఇక పోస్టర్ తో పాటుగా దీనికి డైలాగ్ క్యాప్షన్‌గా హిందీలో ‘‘హా..తో..?’’ అని పోస్టర్‌ పై ఉంది. ఇకపోతే దీంతో ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఇది ‘హిట్’ సినిమా ఫ్రాంచైజీలో రాబోయే సినిమా అని.. ఇందులో నాని అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి నాని కెరీర్‌లో తెరకెక్కనున్న 32వ ప్రాజెక్ట్ నిజంగానే ‘హిట్-3’ మూవీని  లేకపోతే వేరొక సినిమానా అనేది సెప్టెంబర్ 5న

 పూర్తిగా తెలియనుంది. ఇది ఇలా ఉంటే  తాజాగా  నాని హీరోగా యంగ్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా “సరిపోదా శనివారం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమాలో నాని తన యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఆయన పాత్రకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎంతగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందో మనందరికీ తెలిసిందే. ప్రేక్షకులు ఈ సినిమాను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో వారి కామెంట్స్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సినిమా కథ, నటీనటుల నటన, దర్శకత్వం అన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: