డైరెక్టర్ హరి శంకర్, రవితేజ కాంబినేషన్లో ఆగస్టు 15న విడుదలైన చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకోవడమే కాకుండా రవితేజ ని డైరెక్టర్ హరీష్ శంకర్ ని చాలా మంది ట్రోల్ చేయడం జరిగింది. రవితేజ అభిమానులు కూడా ఎందుకు ఇలాంటి కథను ఎంచుకున్నాడు అనే విధంగా అభిమానులు నిరాశ చెందారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన వంతుగా కొంత రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి చూద్దాం.


డైరెక్టర్ హరి శంకర్ మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం రెండు కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే మరింత వెనక్కి ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన మీద నమ్మకంతో అటు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ సినిమాను తీసుకున్నారని తెలిసి ఇప్పుడు డబ్బులు వెనక్కి రాలేదని తెలుసుకొని కొంతమేరకు వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రవితేజ ఈ విషయం పైన ఇంకా ఏ విధంగా స్పందించలేదు.


మిస్టర్ బచ్చన్ సినిమా 2018లో వచ్చిన హిందీలో రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించడం జరిగింది. ఒరిజినల్ స్టోరీ కాస్త భిన్నంగా ఉన్నప్పటికీ డైరెక్టర్ హరీష్ శంకర్ మాత్రం ఇందులో కొన్ని కమర్షియల్ హంగులు ఎలిమెంట్స్ పాటలు ఇలా అన్నీ కూడా అదనంగా జోడించి తీయడంతో ఈ సినిమా కిచిడీగా మారిపోయింది. ముఖ్యంగా హీరోయిన్ భాగ్యశ్రీ అందాలను చూపించడం కోసమే ఈ సినిమాను తీసినట్టుగా విమర్శలు కూడా వచ్చాయి. మిస్టర్ బచ్చన్ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ సినిమాని స్ట్రిమింగ్ చేసుకునే విధంగా వెలుసుబాటు కల్పించారట. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా వచ్చే వారమే ఓటీటిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: