కోలీవుడ్ హీరో ఇలయదళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ది గోట్.. డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. మీనాక్షి చౌదరి, మాళవికా శర్మ ప్రభుదేవా వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ రోజున ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చింది మరి ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉందో తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.


ది గోట్ సినిమా ట్రైలర్ విడుదలైనయినప్పటికీ మంచి పాపులర్టి సంపాదించుకున్నప్పటికీ విజయ్ నీ ఇందులో చూపించిన తీరు అభిమానులకు నచ్చలేదు. దీంతో చాలా దారుణంగా ట్రోల్స్ వినిపించాయి. సినిమా విషయానికి వస్తే..గోట్ చిత్రం మూడు గంటలు రన్ టైం తో మొదలవుతుంది. ఈ చిత్రం 2008లో కెన్యాలో అన్నట్టుగా కథని ప్రారంభిస్తారట.. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత ఒక హై వోల్టేజ్ యాక్షన్ తో హీరో విజయ్ ఎంట్రీ ఇస్తారని నేటిజన్స్ తెలుపుతున్నారు. మొదటి భాగం అంతా కూడా విజయ్ మార్క్, స్టైల్ కామెడీ టైమింగ్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయట.



అయితే కొన్ని యాక్షన్ సీన్స్ కాస్త లెంగ్తిగా అనిపిస్తున్నాయని ట్విట్టర్లో నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు కూడా వాస్తవానికి కాస్త దూరంగానే ఉన్నాయట. ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందని మ్యూజిక్ యువన్ శంకర్ రాజ అదరగొట్టేసారట. సెకండాఫ్ల అద్భుతమైనటువంటి ఒక స్టేజి సెట్ చేసినట్లుగా తెలుపుతున్నారు. అయితే ఇందులో కూడా కొన్ని సన్నివేశాలు కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తోందట. సినిమా లాస్ట్ 40 నిమిషాలు మళ్లీ హైలెట్గా నిలిచిందని తెలుపుతున్నారు. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని ట్విట్టర్లో తెలియజేస్తున్నారు. మరి కొంతమంది సినిమా బోరింగ్ గా ఉందని విఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా లేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఓవరాల్ గా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకున్నట్టు మరికొంతమంది తెలుపుతున్నారు. పూర్తి రివ్యూ రావాలంటే మరొక కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: