ఈనెల 27న విడుదల కాబోతున్న ‘దేవర’ మూవీ గురించి జూనియర్ అభిమానులు మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ‘కల్కి 2898’ మూవీ తరువాత టాలీవుడ్ ను షేక్ చేసే సినిమా ఏదీ విడుదల కాకపోవడంతో గత కొంతకాలంగా ధియేటర్లు అన్నీ చాల కళావిహీనంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆలోటును ‘దేవర’ తీరుస్తుందని ఈమూవీ నిర్మాతలు ఈమూవీ రైట్స్ కొనుక్కున్న బయ్యర్లు ఆశిస్తున్నారు.


అయితే ఇప్పటివరకు ఈసినిమాకు సంబంధించి విడుదలైన రెండు పాటలకు స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో తారక్ అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు. దీనికి కారణం జూనియర్ సినిమాలలో కనిపించే తారక్ స్టెప్స్ ఆపాటలలో కనిపించకపోవడం. అయితే లేటెస్ట్ గా ఈసినిమాకు సంబంధించి విడుదలైన ‘దావూది దావూది’ ఆలోటును తీరుస్తున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.  


లేటెస్ట్ గా విడుదలైన రెండు నిముషాల ఈవీడియో సాంగ్ లో తారక్ ‘కొరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా’ పాటకు తారక్ వేసిన స్టెప్ లు ధియేటర్లలో ప్రేక్షకులు స్టెప్స్ వేసేలా పాట ఉందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈపాటలో తారక్ జాన్వీ కపూర్ ల కాంబినేషన్ అదిరిపోయిందనీ అనడమే కాకుండా తారక్ తో సరిసమానంగా జాన్వీ వేసిన స్టెప్స్ ని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.


ఈపాటతో ఈమూవీ పై ఇప్పటివరకు ఉన్న కొద్దిపాటి సందేహాలు తొలిగిపోయాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక త్వరలో విడుదలకాబోతున్న ఈమూవీకి సంబంధించిన ఆయుధ పూజ పాట ఈమూవీకి హైలెట్ గా నిలుస్తుందని ఆతరువాత విడుదలకాబోయే ఈమూవీ ట్రైలర్ తో ఈమూవీ పై అంచనాలు తారా స్థాయికి చేరుకుంటాయని అంచనాలలో ఉన్నారు. ఇప్పటివరకు జూనియర్ సోలో హీరోగా నటించిన ఏసినిమాకు 1000 కోట్ల కలక్షన్స్ రాలేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీగా విడుదలకాబోతున్న ఈమూవీతో తారక్  రేంజ్ జాతీయ స్థాయిలో మారుమ్రోగిపోవడం ఖాయం అన్న అభిమానుల అంచనాలు ఎంతవరకు నిజం అవుతాయో వేచి చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: