తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన సినిమాలలో ట్రైన్ ఎపిసోడ్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ట్రైన్ ఎపిసోడ్ ఉన్న సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. అలా ట్రైన్ ఎపిసోడ్ తో ఉన్న సినిమాలలో భారీ విజయాలను అందుకున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతంగా సక్సెస్ అయిన ట్రైన్ ఎపిసోడ్లలో వెంకీ మూవీ ఎపిసోడ్ ప్రధమ స్థానంలో ఉంటుంది. ఎందుకు అంటే ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్లో వచ్చే కామెడీ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.

సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ మూవీ లోని ట్రైన్ ఎపిసోడ్ టీవీలలో వస్తుంది అంటే అనేక మంది ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ను వీక్షిస్తూ ఉంటారు. అంతలా ఈ ట్రైన్ ఎపిసోడ్ సక్సెస్ అయ్యింది. రవితేజ హీరోగా రూపొందిన ఈ సినిమాలో స్నేహ హీరోయిన్గా నటించగా శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక సందీప్ కిషన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా చాలా భాగం ట్రైన్ లోనే ఉంటుంది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీలోని ఫస్ట్ ఆఫ్ లో కూడా చాలా భాగం ట్రైన్ లోనే ఉంటుంది. ఈ మూవీలోని ట్రైన్ ఎపిసోడ్ అద్భుతమైన స్థాయిలో ఉంటుంది. అలాగే ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్ అయింది. ఇకపోతే శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన వెంకీ మూవీ లోని ట్రైన్ ఎపిసోడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక ప్రస్తుతం శ్రీను వైట్ల , గోపీచంద్ తో విశ్వం మూవీ ని రూపొందిస్తున్నాడు. ఇందులో కూడా అదిరిపోయే ట్రైన్ ఎపిసోడ్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ కూడా సూపర్ సక్సెస్ అయ్యి మూవీ కూడా మంచి విజయం అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: