నందమూరి నటసింహం బాలకృష్ణ పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకులను పలకరించాడు. బాలకృష్ణ పోయిన సంవత్సరం మొదటగా సంక్రాంతి పండుగ సందర్భంగా వీర సింహా రెడ్డి అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా భగవంత్ కేసరి అనే మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక పోయిన సంవత్సరం రెండు మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండింటితో భారీ విజయాలను అందుకున్న బాలయ్య ఈ సంవత్సరం మాత్రం ఒక్క మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనబడడం లేదు.

ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో "N B K 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను గాని , విడుదల తేదీని కానీ మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ మూవీస్ షూటింగ్ స్టార్ట్ అయిన కొత్తలో ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది అని ఓ వార్త వైరల్ అయింది. ఆ తర్వాత ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది అని మరో వార్త వైరల్ అయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉంది అని మరో వార్త వైరల్ అవుతుంది.

కానీ అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు వెలువడలేదు. ఇక ఈ మూవీ షూటింగ్ లేట్ కావడానికి కారణం మధ్యలో బాలయ్య ఎలక్షన్ల వైపు ఇంట్రెస్ట్ చూపడంతో ఆ సమయంలో షూటింగ్ జరగలేదు అని , అందుకే ఈ మూవీ కాస్త డిలే అవుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఏదేమైనా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో "N B K 109" మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: