భారీ వర్షాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు వరదల్లో చిక్కుకుపోయాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ పూర్తిగా జలవాడగా మారిపోయింది.. ఎన్నో లంక గ్రామాలు మునిగిపోతున్నాయి. ప్రస్తుతం ఏపీలో ఎన్నో విపత్కర పరిస్తితులు ఏర్పడ్డాయి. కేవలం ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలో కూడా ఖమ్మం, వరంగల్ వంటి నగరాలు వరద నీటిలో మునిగిపోయాయి. రెండు మూడు అంతస్తుల వరకు ఉన్న ఇల్లు కూడా మునిగిపోయాయి.వరద ఉదృతికి ఎంతోమంది నిరాశ్రయులయ్యారు.తినడానికి కూడా తిండి లేకుండా పోయింది.స్టార్ కి సెలబ్రిటీలు, బిజినెస్ మాన్లు,రాజకీయ నాయకులు,రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు తమకు తోచిన సహాయం చేస్తున్నారు. ఇక బాలకృష్ణ,చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్,రామ్ చరణ్,విశ్వక్సేన్, ఎన్టీఆర్,సిద్దు జొన్నలగడ్డ, మహేష్ బాబు, నాగార్జున,సందీప్ కిషన్ వంటి ఎంతో మంది హీరోలు తమ వంతుగా కోట్లు, లక్షల విరాళాలు ఇస్తున్నారు. 

ఇక రీసెంట్ గా కేరళలోని వయనాడు బాధితులకు కూడా మన తెలుగు హీరోలు కోట్లు,లక్షల విరాళం అందించారు. కానీ తమిళ హీరోలు మాత్రం మన తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ఇవ్వడం లేదు. అక్కడి హీరోలు చేసిన సినిమాలు ఇక్కడ రిలీజ్ చేసుకొని కోట్లకు కోట్ల డబ్బులు సంపాదిస్తున్న నిర్మాతలు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వడం లేదు. ఇక ఎంతోమంది హీరోలు కోట్ల కు కోట్ల విరాళాలు ఇస్తుంటే తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్లు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తే  ఫేమస్ అయినా ఎంతో మంది హీరోయిన్లు వరద బాధితులకు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వకపోవడంతో చాలామంది నెటిజన్లు వీరిపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అంతే కాదు చిన్న హీరోయినైనా అనన్య నాగళ్ల తనకు తోచిన సహాయం చేస్తూ 5 లక్షల విరాళం 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది.ఇక చిన్న హీరోయిన్ కి ఉన్న బుద్ధి కూడా మీకు లేదా అంటూ పెద్ద హీరోయిన్లను తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. అలా సమంత, కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్, నయనతార,శృతిహాసన్, రష్మిక మందన్నా, అనుష్క,త్రిష వంటి ఎంతో మంది హీరోయిన్లను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వాళ్లపై ట్రోల్స్ చేస్తున్నారు. మరి సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ ని చూసైనా ఈ హీరోయిన్ల మనసు చలించి విరాళాలు ఇస్తారా అనేది చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: