కొత్త కథలతో వస్తున్నప్పటికీ.. ప్రేక్షకులకు పెద్దగా సినిమా ఎక్కడం లేదు. దీంతో అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే హీరో రవితేజ తాజాగా చేసిన మిస్టర్ బచ్చన్ కూడా... బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ దెబ్బకు హీరో రవితేజకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు సమాచారం. మాస్ మహారాజు రవితేజ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో... మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికే సినిమాలు హిట్ అయ్యాయి. మిరపకాయ్ సినిమా రవితేజ కెరీర్ లో మిగిలిపోతుంది. అయితే అచ్చం అలాగే మిస్టర్ బచ్చన్ సినిమా కూడా ఉంటుందని అందరూ అంటున్నారు. కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం నిరాశపరిచాడు. మాస్ మహారాజ రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ అద్భుతంగా నటించినప్పటికీ... దర్శకుడు హరిశంకర్ విఫలమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కాలేదు కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకొని... పెద్దగా వసూళ్లను రాబట్ట లేకపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే... నిర్మాత కు హరీష్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రెండు కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సమాచారం అందుతుంది. దానికి ఒక సినిమాకు దర్శకుడు హరి శంకర్ 10 కోట్లు తీసుకుంటారు. మిస్టర్ బచ్చన్ కోసం 10 కోట్లు తీసుకున్న హరీష్ శంకర్.. నిర్మాతకు రెండు కోట్లు తిరిగి ఇచ్చేశాడట. మరి కొన్ని రోజుల్లో మరింత కూడా వెనక్కి ఇచ్చే ఛాన్స్ ఉందట. రవితేజ కూడా అదే బాటలో ఉన్నారని సమాచారం.