ఆగస్ట్ చివరిలో అప్డేట్ ఇస్తానని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ హామీ ఇచ్చాడు, కానీ అది కూడా జరగలేదు. ఇంకా ఎలాంటి అప్డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నెగిటివ్ డ్రెండ్ ను ప్రారంభించారు. ఈ డ్రెండ్ పట్ల థమన్ రెస్పాండ్ అయ్యారు. గత కొన్నేళ్లుగా చిత్ర యూనిట్ చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ సుదీర్ఘమైన ట్వీట్ ను పోస్ట్ చేశాడు. నెగిటివ్ డ్రెండ్స్ లేదా అసభ్యకరమైన వ్యాఖ్యలను వ్యాప్తి చేయటం వల్ల ఉపయోగం ఏమిటి. ఇది సినిమాను, దాని గొప్పతనాన్ని దెబ్బతీస్తుంది.
మా సాంకేతిక బృందం అంతా గత 2 సంవత్సరాల నుంచి కండెంట్ ను కలిగి ఉన్నారు మరియు భద్రపరుస్తున్నారు. దానిని మీ అందరికీ గొప్ప పద్ధతిలో తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అభిమానులందరూ దయతో మాకు కొంత సానుకూల శక్తిని అందించాలని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. నెగెటివ్ డ్రెండ్ చెయ్యటం లాంటివి సినిమా ప్రతిష్టను దెబ్బతీస్తాయని థమన్ పేర్కొన్నాడు. ఈ నెలలో తప్పకుండా అప్డేట్ వస్తుందని చరణ్ అభిమానులకు హమీ ఇచ్చాడు. కైరా ఆద్వానీ కథానాయకగా నటిస్తున్న ఈ చిత్రంలో, ఎస్. జే.సూర్య ప్రతి నాయకుడిగా నటించాడు. ఇక ఈ సినిమా రిలీజింగ్ డేట్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.