ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి వార్ జరుగుతూ ఉంటాయి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఇక వచ్చే సంవత్సరం కూడా అలాంటి యుద్ధమే బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉండగా , మల్లాడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు.

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన మరో హీరో అయినటువంటి విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ రెండు సినిమాలను మినహాయిస్తే తెలుగు నుండి మరే భారీ సినిమా కూడా సంక్రాంతి పండుగకు రిలీజ్ కి లేదు. దానితో మరో తెలుగు సినిమా విడుదల అయినా కూడా సంక్రాంతి కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మరి ఈ సినిమాను సంక్రాంతి పండుగ్ సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి బాలయ్య కూడా ఈ సారి సంక్రాంతి కి తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ముగ్గురు టాలీవుడ్ సీనియర్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలో ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: