ప్రశాంత్ వర్మ ఈ సినిమా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో వీలైనంత వేగంగా కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యాడంట. మూవీ రిలీజ్ డేట్ పై కూడా ఎనౌన్స్ రోజే క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందంట. 2025 దసరాకి మోక్షజ్ఞ డెబ్యూ మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఎలాగూ ఏడాది సమయం ఉంది. ఆరు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకొని మరో ఆరు నెలలు పోస్ట్ ప్రొడక్షన్, సీజీ వర్క్ కి సమయం సరిపోతుంది.అందుకే ఏడాదిలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చేలా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేసుకున్నాడంట. ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఇప్పుడు నందమూరి అభిమానుల్లో ఉంది. మోక్షజ్ఞ అరంగేట్రం సినిమాపై ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమ కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం విశేషం. ఈ సినిమా తర్వాత మోక్షజ్ఞతో సినిమాలు చేయడానికి మరో ముగ్గురు, నలుగురు దర్శకులు లైన్ అప్ లో ఉన్నారని బాలయ్య చెప్పారు.
నందమూరి హీరోలలో ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. మోక్షజ్ఞ ఎన్టీఆర్ ఇమేజ్ ని అందుకోగలడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా మోక్షజ్ఞ మాస్ హీరోగా ఒక సినిమా చేయాలని బాలయ్య అనుకుంటున్నారు. అఖండ సీక్వెల్ తర్వాత బోయపాటి మోక్షజ్ఞ సినిమాపై వర్క్ చేయొచ్చని మాట నందమూరి అభిమానుల్లో వినిపిస్తోంది.అయితే ఈ సినిమా నుంచి మరో కీలక అప్డేట్ తాజాగా బాలయ్యనే స్వయంగా వెల్లడించారు. అదేంటంటే ఈ చిత్రానికి తన కుమార్త తేజస్వినీనే ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. డైరక్టర్, ప్రొడ్యూసర్ దాదాపు కన్ఫమ్ అయిపోగా మిగిలిన నటీనటులు ఎవరనేది తెలుసుకునేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయకతప్పదు మరి.