తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ముందు వరుసలో ఉంటారు. వీరిద్దరూ కూడా కెరియర్ లో ఎక్కువ శాతం అద్భుతమైన మాస్ కమర్షియల్ సినిమాలలో హీరోగా నటించి అదిరిపోయే రేంజ్ గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకున్నారు. ఇకపోతే వీరి అభిమానులు చాలా మంది వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని అనేక సార్లు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.

ఈవెంట్ కు చిరంజీవి కూడా విచ్చేశాడు. ఇక బాలయ్య సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ... నాకు బాలకృష్ణ తో కలిసి ఒక సినిమాలో నటించాలని ఉంది. ఎవరైనా మంచి కథతో వస్తే కచ్చితంగా నేను బాలకృష్ణతో కలిసి నటిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇలా స్టేట్మెంట్ ఇవ్వడంతోనే కొంత మంది దర్శకులు వీరిద్దరి కాంబోలో భారీ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన మాస్ దర్శకులు అయినటువంటి బోయపాటి శ్రీను , హరీష్ శంకర్ లాంటి దర్శకులు వీరిద్దరి కాంబో లో భారీ మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కథలను సిద్ధం చేస్తున్నట్లు , అన్ని సెట్ అయితే వీరిద్దరికి ఆ కథలను వినిపించడానికి ఈ దర్శకులు రెడీ అవుతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో అవుతుంది. ఇకపోతే బోయపాటి ఇప్పటికే బాలకృష్ణ తో అనేక సినిమాలను తెరకెక్కించాడు. కానీ చిరంజీవి తో సినిమా చేయలేదు. ఇక హరీష్ శంకర్ ఇటు బాలయ్య , అటు చిరంజీవి ఇద్దరిలో ఎవరితో కూడా సినిమా ఇప్పటి వరకు సినిమా చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: