తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఒకరు. v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఇప్పటికే డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించాడు. దానయ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన బ్రూస్ లీ , వినయ విధేయ రామ , ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో బ్రూస్ లీ , వినయ్ విధేయ రామ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టగా , ఆర్ ఆర్ ఆర్ మూవీ మాత్రం అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే తాజాగా దానయ్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా రామ్ చరణ్ కు సంబంధించిన ఓ మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు తెలియజేశారు. అసలు విషయం లోకి వెళితే. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా దానయ్య మాట్లాడుతూ ... నాకు సినిమాల కథలను వింటేనే ఆ కథను సినిమాగా రూపొందిస్తే అది ఆడుతుందో లేదో దాదాపుగా అర్థం అవుతుంది. ఏదో ఒకటి , రెండు మిస్టేక్స్ తప్పితే నేను అనుకున్నవి అనుకున్నట్టుగానే జరుగుతాయి. సినిమా షూటింగ్ ను చూసిన ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది చెప్పగలను.

నేను కొంత కాలం క్రితం రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లాను. అక్కడ సన్నివేశాలు చూస్తూ ఉంటే నాకు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. దానితో నేను ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చరణ్ కు చెప్పాను. ఇక సినిమా విడుదల అయింది , నేను చెప్పిన మాదిరిగానే ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది అని దానయ్య తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: