తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలలో అర్జెంటుగా హిట్ కొట్టాల్సిన స్థాయి స్థితిలో ఉన్న హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన ఆఖరుగా ధమాకా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన వరుస పెట్టి చాలా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా కనీసం యావరేజ్ విజయాన్ని కూడా అందుకోలేదు. దానితో కచ్చితంగా ఈయన తన తదుపరి మూవీ తో హిట్ కొట్టాల్సిన స్థితికి వచ్చేసాడు. పోయిన సంవత్సరం దసరా పండుగ సందర్భంగా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది.

మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్లో విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఏకంగా మూడు గంటలకు పైగా నిడివితో  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఈ మూవీ రన్ టైమ్ ఈ మూవీ కి మైనస్ అని , రన్ టైమ్ కాస్త తగ్గి ఉంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చే ఉండే అవకాశం ఉండేది అని కొంత మంది అభిప్రాయపడ్డారు. దానితో వెంటనే ఈ సినిమా రన్ టైమ్ ను తగ్గించారు. కొంత కాలం క్రితమే రవితేజ హీరోగా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమా థియేటర్లలో విడుదల అయింది. ఈ మూవీ కూడా కాస్త ఎక్కువ రన్ టైమ్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కి కూడా నెగటివ్ టాక్ రావడం , ఈ సినిమా రన్ టైమ్ ను కూడా కాస్త తగ్గించుకుంటే బాగుండేది అని అభిప్రాయాలు జనాల నుండి రావడంతో వెంటనే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా తగ్గించారు.

ఇలా టైగర్ నాగేశ్వరరావు , మిస్టర్ బచ్చన్ రెండు మూవీల రన్ టైమ్ లను విడుదల తర్వాత తగ్గించారు. కానీ ఈ సినిమా టాక్ గాని , కలెక్షన్లు కానీ ఈ మూవీ రన్ టైమ్ ను తగ్గించడం వల్ల ఏ మాత్రం మారలేదు. ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అలా జనాల నుండి నెగిటివ్ టాక్ వచ్చిన విషయాలను తొందరగా కరెక్ట్ చేసినా కూడా రవితేజ కు ఈ రెండు మూవీల ద్వారా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt