పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా భారీ హిట్ సాధించింది. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1,200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి ఈ మూవీ భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ఈ సినిమా అద్భుతంగా ఉందనే పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపింది. ఇప్పుడు ఓటీటీలోనూ కల్కి 2898 ఏడీ సినిమా దూసుకెళుతోంది. గ్లోబల్ రేంజ్‍లో సత్తాచాటి టాప్ ప్లేస్‍కు చేరింది.కల్కి 2898 ఏడీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆగస్టు 22న స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ సినిమా మొదటి నుంచే భారీ వ్యూస్ దక్కించుకుంటోంది. గ్లోబల్ రేంజ్‍లోనూ ఈ చిత్రం దుమ్మురేపుతోంది. భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాల్లోనూ భారీగా వ్యూస్ సాధిస్తోంది. దీంతో ఇప్పుడు ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో నాన్-ఇంగ్లిష్ సినిమాల విభాగంలో గ్లోబల్ ట్రెండింగ్‍లో కల్కి చిత్రం టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.కల్కి 2898 ఏడీ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చి రెండు వారాలైన భారీగా వ్యూస్ సాధిస్తూ దూసుకెళుతోంది. నానాటికీ గ్లోబల్‍గా రీచ్ పెరుగుతోంది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో హిందీలో ఒక్కటే వచ్చినా అంచనాలకు మించి వ్యూస్ సాధిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఏకంగా గ్లోబల్‍గా ఇప్పటి వరకు 7.1మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. నాన్-ఇంగ్లిష్ కేటగిరీలో ప్రస్తుతం గ్లోబల్ టాప్‍లో ఉంది.కల్కి 2898 ఏడీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఇండియాలో ఇంకా టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఒమన్, శ్రీలంక, యూఏఈ సహా మొత్తంగా 11 దేశాల్లో ఈ చిత్రం ఇంకా టాప్-10లో ట్రెండింగ్ అవుతోంది.ఈ నేపథ్యంలో కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ తో పాటు ఓటీటీ లో సంచలనం సృష్టిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాల్లో కల్కి ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండ్ అవుతుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తెలియజేస్తూ చేసిన పోస్టును నాగస్విని ఇన్స్టా లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రం 1100  కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే.కల్కి 2898 ఏడీ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఓటీటీలోనూ భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: