యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు అనేక సినిమాలలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించారు. కానీ ఒక హీరోయిన్ మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కి ఎంతో స్పెషల్. ఎందుకో తెలుసా ..? జూనియర్ ఎన్టీఆర్ ఒక హీరోయిన్ తో మూడు సినిమాలలో నటించగా , ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మరి ఆ సినిమాలు ఏవి ..? ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబోలో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. ఆ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. మొదటగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బృందావనం అనే సినిమా వచ్చింది. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా టెంపర్ అనే మూవీ రూపొందింది.

సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాష్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన బాద్ షా సినిమాలో ఎన్టీఆర్ , కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇలా వీరి కాంబో లో ఇప్పటి వరకు మూడు సినిమాలు రాగా , ఆ మూడు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: