రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ మూవీతో చారిత్రాత్మక విజయం అందుకున్న జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ గురించి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర: పార్ట్ వన్‌తో తన ఫ్యాన్స్ ను అలరించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన డేట్ లీక్ అయ్యింది.కోస్టల్ ఆంధ్ర నేపధ్యంలో రూపొందిన చిత్రం దేవరలో మొదటిసారిగా జాన్వీ కపూర్‌ జూనియర్ ఎన్టీఆర్ తో జతకట్టింది. సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్లు నడుస్తున్నాయి. వరుసగా సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేస్తుండడంతో గత నెల రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దేవర సందడే కన్పిస్తోంది. ఇప్పుడు దేవర విడుదలకు సరిగ్గా 23 రోజులు మిగిలి ఉండగా నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. వాళ్ళ కోసమే అన్నట్టుగా తాజాగా దేవర ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది.తాజా సమాచారం ప్రకారం దేవర థియేట్రికల్ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ట్రైలర్‌ను సెప్టెంబర్ 10 న లాంచ్ చేయడానికి టీమ్ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం భారీ ఈవెంట్ ను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్.విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, అదిరిపోయే డైలాగ్స్ తో ఉన్న ట్రైలర్ ను చిత్ర బృందం ఖరారు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మూడు సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇప్పటికైతే మేకర్స్ ట్రైలర్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ట్రైలర్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దేవర ట్రైలర్ లో డ్రామా, యాక్షన్ ఎక్కువగా ఉండబోతున్నాయని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్, జాన్వి కపూర్ తో సహ దేవర టీం అంతా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంటారని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: