మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడని చెప్పాలి. వరుస హిట్స్ తో లేటెస్ట్ గా “సరిపోదా శనివారం” తో కలిపి హ్యాట్రిక్ విజయాలు అందుకొని అదరగొట్టిన నాని ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను కాంబినేషన్ లో చేస్తున్న మాస్ పోలీస్ అండ్ యాక్షన్ డ్రామా “హిట్ 3” సినిమాపై నేడు ఓ సాలిడ్ అప్డేట్ వస్తుంది అని మేకర్స్ రీసెంట్ గానే టీజ్ చేసిన సంగతి తెలిసిందే.ఫైనల్ గా ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అయ్యిపోయింది. మరి మేకర్స్ ఒక క్రేజీ మాస్ పోస్టర్ ని రిలీజ్ చేసి అదరగొట్టగా దీనితో పాటుగా నానిపై తన మాస్ స్వాగ్ తో అర్జున్ సర్కార్ గా ఒక ఇంట్రెస్టింగ్ మాస్ గ్లింప్స్ ని కూడా వదిలారు. దీనితో నాని ఫ్యాన్స్ కి మాత్రం ఇది మంచి ఫీస్ట్ ఇచ్చేలా ఉందని చెప్పాలి. ఈ మూవీలో అర్జున్ స‌ర్కార్ పాత్ర‌లో నాని క‌నిపించ‌నున్న‌ట్లు చెప్పేశారు. ఇందుకు సంబంధించిన ఓ చిన్న టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇది నాని ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇస్తోంది. అంతేకాదండోయ్.. ఇక ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది మే 1న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా అనౌన్స్ చేసేసారు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, అలాగే యూనానిమస్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.దీనికి మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.కాగా.. గ‌తంలో హిట్ సిరీస్‌లో రెండు చిత్రాలు వ‌చ్చాయి. ఆ రెండు సినిమాలు మంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. ఈ రెండు సినిమాల‌కు కూడా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. హిట్‌లో విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టించ‌గా, హిట్‌-2లో అడివి శేష్ న‌టించారు. ఇక తాజాగా హిట్‌-3లో నాని న‌టిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: