ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోల క్రేజ్ ఎంతలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఒకప్పుడు తెలుగులో మాత్రమే స్టార్ హీరోల సినిమాలు నడిచేవి. ఇక తమిళం కన్నడంలో అంతంత మాత్రంగానే వసూళ్లు సాధించేవి. కానీ ఇప్పుడు కేవలం సౌత్ లో మాత్రమే కాదు బాలీవుడ్లో సైతం బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నాయి తెలుగు సినిమాలు.


 ఇప్పటికే అల్లు అర్జున్ ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి హీరోలు బాలీవుడ్ ప్రేక్షకులను సైతం అలరించి అక్కడ బ్లాక్ బస్టర్ హీట్ లో కొట్టేశాడు.అయితే ఇలా తెలుగు హీరోలకు వస్తున్న పాపులారిటీని చూసి కొంతమంది ఓర్వలేక పోతున్నారు. ఈ క్రమంలో ఇటీవలే బాలీవుడ్ నటుడు అర్షద్ టాలీవుడ్ హీరో ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఎంత సంచలనంగా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అల్లు అర్జున్ కి కూడా ఇలాంటి అవమానమే జరిగింది. ఒక అవార్డు ఈవెంట్ కు  అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేసాడు. నయనతారకి ఆయన చేతుల మీదుగా ఉత్తమమ నటి ఆవార్డు అందించాలి.


 కానీ అల్లు అర్జున్ చేతుల మీదుగా నయన తార ఉత్తమ నటి అవార్డును స్వీకరించేందుకు ఇష్టపడలేదు. ఆయనకి బదులుగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన సతీష్ విగ్నేష్ చేతుల మీదుగా ఈ అవార్డు ఇవ్వాలని యాంకర్ ను కోరింది.  అయితే ఈ ఘటన సందర్భంలో అల్లు అర్జున్ చాలా ఫీలయ్యాడు. కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం తక్కువైంది. అయితే అద్భుతమైన టాలెంట్ ఉన్న హీరో, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి ఇంతటి అవమానమా అని అభిమానులు ఫీలయ్యారు. ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో అక్కడే మళ్ళీ అల్లు అర్జున్ నయనతార కి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవల అవార్డు ఫంక్షన్ కి అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేసాడు. స్టైల్గా స్టేజ్ మీద రాంప్ వాక్  చేస్తూ నయనతార వైపు చూసి తల తిప్పాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: