అయితే నామినేషన్స్ ప్రక్రియలో ఎంతోమంది నాగ మణికంఠను టార్గెట్ చేశారు అన్న విషయం తెలిసిందే. ఆయన సింపతి కార్ట్ వాడుతున్నాడు అంటూ అందరూ నామినేట్ చేసిన సభ్యులందరూ కూడా మణికంఠ పై ఆరోపణలు చేశాడు. అతని వ్యవహార శైలి కూడా బాగాలేదు అంటూ ఎంతో మంది ఫిర్యాదు చేశారు. అయితే తన జీవితం గురించి ఆయన చెప్పుకునే విధానం తన లైఫ్లో విషాదాల గురించి పదే పదే చెప్పుకోవడం కాంట్రవర్సీగా మారింది.దీంతో ప్రతిసారి తన జీవితం గురించి చెబుతూ తన బాధల గురించి చెబుతూ మణికంఠ ఎమోషనల్ అవుతూ ఉండడంతో సింపతి కార్డు వాడుతున్నాడు అంటూ అటు బయట ఉన్న ప్రేక్షకులకు కూడా అనిపిస్తుంది.
అయితే నామినేషన్ ప్రక్రియ అనంతరం ఇక అటు నాగ మణికంఠ బోరుణ ఏడ్చేశాడు. తనలో తాను కుమిలిపోతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆయనను ఓదార్చేందుకు ఇంటి సభ్యులందరూ అతడి వద్దకు వచ్చి సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తనలో బాధను తట్టుకోలేక ఏడ్చిన మనికంట పోకిరి లెవెల్లో ఊహించిన ట్విస్ట్ ఇచ్చాడు. నా లైఫ్ అంతా రోలర్ కోస్టర్ లా ఉంది. నేను నేను అబద్ధం ఆడాను. నిజాలు చెప్పాను. బిగ్బాస్ తర్వాత నాకు జీవితం ఉందా? నాకు భార్య కావాలి నా అత్త మామల నుంచి గౌరవం కావాలి. నా మారుతల్లి కావాలి. నా కూతురు నాకు కావాలి అంటూ చెబుతూ ఏకంగా తన విగ్గును పీకేసాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఏంటి ఇన్నాళ్లు మణికంఠ మేనేజ్ చేసింది విగ్గుతోన అని ఆశ్చర్యపోయారు. ఇది పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు.