టాలీవుడ్ నాచురల్ బ్యూటీగా పేరుపొందిన సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నది. త్వరలోనే బాలీవుడ్ లోకి రామాయణం కథతో అడుగుపెట్టబోతోంది. అలాగే సాయి పల్లకి ఒక చెల్లెలు ఉందనే విషయం తెలిసిందే సాయి పల్లవి చెల్లెలి పేరు పూజా కన్నన్. ఈమె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో అవకాశాలు రాలేకపోవడంతో సినిమాలకు దూరమైన పూజా కన్నా చదువు పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా కన్నన్ వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది.

పూజా కన్నన్ వివాహ బంధం లోకి అడుగుపెట్టింది గడిచిన కొన్ని నెల క్రితం తాను ప్రేమించిన అబ్బాయి వినీత్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వివాహ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువురు కుటుంబాల మధ్య స్నేహితుడు బంధువుల సమక్షంలో సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్ వివాహం చాలా గ్రాండ్ గా ఈరోజు జరిగినట్లు తెలుస్తున్నది.


అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో అభిమానులు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అంతే కాకుండా సాయి పల్లవి తన చెల్లెలు పెళ్లిలో చాలా అందంగా చీర కట్టుకొని మరి ముస్తాబయింది. వివాహ వేడుకలో పూజా కన్నన్ తో కలిసి సాయి పల్లవి డాన్స్ వేయడం జరిగింది. మరొకసారి సాయి పల్లవి డాన్స్ చూసిన అభిమానులు ఫిదా అవుతున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా పట్టు చీరలో న్యాచురల్ బ్యూటీ చాలా చూడచక్కగా కనిపిస్తోంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. సాయి పల్లవి  ప్రస్తుతం అక్కినేని హీరో నాగచైతన్య తో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమాలో నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: