టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు ఎక్కువగా వివాదాస్పదమైన వార్తలలో కూడా నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా కేవలం ఇండస్ట్రీలో ఉండే ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ వ్యవహరిస్తూ ఉంటుంది. తాజాగా ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారిన టిడిపి ఎమ్మెల్యే ఆదిమూలం పైన వచ్చినటువంటి లైంగిక ఆరోపణల పైన ఆమె స్పందించడం జరిగింది.


ముఖ్యంగా మహిళ అధ్యక్షరాలుగా ఉన్న వరలక్ష్మిని ఆదిమూలం వేదిస్తున్నట్లు ఆమె కొన్ని ఆధారాలతో సహా పలు విషయాలను బయటపెట్టింది. దీంతో ఆదిమూలం పేరు వైరల్ గా మారడంతో టిడిపి పార్టీ ఇతడిని సస్పెండ్ కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెడుతూ పవర్ రేపిస్ట్ గురించి బయట పెట్టమని తన భాగస్వామిని ప్రోత్సహించిన భర్తను అభినందించాలి అంటూ తెలిపింది. అతడు అలా చేయకపోతే ఎమ్మెల్యే సస్పెండ్ అయ్యే వారు కాదు చాలామంది అధికారంలో ఉన్నామని మౌనంగా ఉంటారు. కానీ అలా ఉండలేదు అతడికి వందనాలు అంటూ తెలిపింది..


రాయలసీమలో సత్యవేడు నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన పైన ఇలాంటి లైంగిక దాడి చేశారంటూ కూడా ఆ జిల్లా మహిళా అధ్యక్షురాలు అయిన వరలక్ష్మి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తెలియజేసింది. దీంతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు ఉలిక్కిపడ్డారు. అయితే తన భర్త ఇచ్చిన సలహా వల్లే ఆదిమూలంని అడ్డుకట్టు వేయగలిగింది. అయితే ఈ విషయం పైన ఆటు టిడిపి పార్టీ వెంటనే స్పందించి ఎమ్మెల్యే ని సస్పెండ్ చేయడమే కాకుండా ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలంటూ సూచించారు. ఎమ్మెల్యే ఆదిమూలం మాత్రం తన మీద వచ్చిన వీడియోలన్నీ కూడా ఫేక్ వీడియోలు అంటూ తెలియజేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: