ఈనెల 27న విడుదలకాబోతున్న ‘దేవర’ పార్ట్ 1 ప్రమోషన్స్ ప్రారంభం కావడంతో ఈ మూవీ పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈమూవీకి సంబంధించి విడుదలైన రెండు పాటలు జూనియర్ అభిమానులకు మాత్రమే కాకుండా సగటు సనీ అభిమానులకు కూడ బాగా నచ్చడంతో ఈమూవీ గ్యారెంటీ హిట్ అన్నప్రచారం జరుగుతోంది.



‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలైన తరువాత తారక్ నుండి చాల గ్యాప్ తీసుకుని విడుదల అవుతున్న మూవీ కావడంతో ఈమూవీ పై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆశక్తి బాగా ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయం ఇప్పుడు బయటపడుతోంది. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీలో ఒక కీలక సన్నివేశం దర్శకుడు కొరటాల శివ క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.



కారంచేడులో ఆరుగురు దళితులు అతి కిరాతకంగా అగ్ర వర్ణాల చేతిలో హత్యకు గురైన సంఘటన ఆరోజులలో ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. నీటిని వాడుకునే దగ్గర మొదలైన గొడవ చిలికి చిలికి గాలి వానగా మారి హత్యలు జరిగే దాకా జరిగిన ఆనాటి సంఘటన దేశ వ్యాప్తంగా అప్పట్లో హాట్ న్యూస్.



ఈ సంఘటన అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీకి సమస్యలు కూడ తెచ్చిపెట్టింది అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి.  అప్పట్లో ఈ సంఘటన రాజకీయంగా పెను దుమారం సృష్టించింది. ఇప్పుడు ఆ సంఘటనను ఇంచుమించు యధాతాదంగా దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ లో చూపెడుతున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. స్వతహాగా కమ్యూనిస్ట్ భావజాలం చాల ఎక్కువగా ఉండే కొరటాల శివ కారెంచేడు సంఘటన పై చాల పరిశోధన చేసి ‘దేవర’ లో ఈ కారెంచేడు సంఘటనను పోలిన సీన్ ను క్రియేట్ చేశాడు అని అంటున్నారు. ఈమధ్య కాలంలో వాస్తవ సంఘటనలు ఆధారంగా తీయబడ్డ సినిమాలు బాగా సక్సస్ అవుతున్న విషయం తెలిసిందే..  



మరింత సమాచారం తెలుసుకోండి: