మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత ఏజ్ 69 సంవత్సరాలు ఇప్పటికీ కూడా హీరోగా సినిమాలలో నటిస్తూ ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా మంచి సంపాదించుకున్నారు మెగా కుటుంబం. ఇప్పటికీ యంగ్ హీరోలకు ధీటుగా తన సినిమాలను విడుదల చేస్తూ అంతే స్టైలిష్ గా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిరంజీవి ఆరోగ్యంగా ఉత్సాహంగా కూడా కనిపించడానికి ఒక సీక్రెట్ ఉన్నదట. ముఖ్యంగా తన ఆహారపు అలవాట్లు వల్లే తాను ఇలా ఉన్నట్లుగా ఇటీవలే తెలియజేశారు వాటి గురించి చూద్దాం.


చిరంజీవి ఇలా కనిపించడానికి కఠినమైన దినచర్యలను ఫాలో అవుతూ ఉంటారట.. ప్రతిరోజు ఉదయం కచ్చితంగా వ్యాయామం చేయడం.. కుటుంబం కోసం కొంత సమయాన్ని రోజు కేటాయించడం. అలాగే యోగా వల్ల కూడా శరీరం చాలా దృఢత్వానికి కారణమవుతుందని వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారట. ముఖ్యంగా తన ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం చేస్తూ ఉంటారట దీనివల్ల తనకి చాలా ఉల్లాసంగా అనిపిస్తుందని తెలుపుతున్నారు చిరంజీవి. అలాగే కుటుంబంతో పిల్లలతో సరదాగా గడుపుతూ తనకి ఇష్టమైన వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారట.


అలాగే స్వచ్ఛంద  కార్యక్రమాలలో కూడా పాల్గొంటారని ఎంత బిజీ ఉన్నప్పటికీ తనకు నిద్ర విశ్రాంతి తగ్గినట్టుగానే తీసుకుంటానని తెలిపారు. సుమారు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోతాను అని తెలిపారు చిరంజీవి. అలాగే ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అనుసరిస్తూ ఉంటానని తెలిపారు. చిరంజీవి ఆహార విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు.. పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలతోపాటు లిన్ ప్రోటీన్ తో ఉన్న ఆహారాలను తీసుకుంటారట. అలాగే తన శరీరం ఎప్పుడూ కూడా డిహైడ్రేటుకు గురి కాకుండా ఉండేందుకు తన శరీరానికి అవసరమైన నీటిని తీసుకుంటానని తెలిపారు. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను జంక్ ఫుడ్ లను అసలు తీసుకొని తెలిపారు. ప్రతిరోజు పులిహోర పప్పు సాంబార్ చికెన్ చేపలు ఇలా ఏవో ఒకటి ఉండేలా చూసుకుంటారట.


ముఖ్యంగా చిరంజీవి జంక్ ఫుడ్లను , స్నాక్స్ వంటివి అసలు తీసుకోరట. ప్రతిరోజు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపే డిన్నర్ ని పూర్తి చేస్తారట. ఇలా చేయడం వల్లే చిరంజీవి ఇంత ఫిట్గా ఆరోగ్యంగా హెల్తీగా అందంగా కనిపిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: