ఈ సంవత్సరం ఇప్పటి వరకు అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేశాయి. ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను ఎక్కువ రోజులు రాబట్టిన సినిమాల విషయంలో తేజ సబ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమా ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ తో కలుపుకొని ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలక్షన్లను ఏకంగా 20 రోజులు రాబట్టి ఈ సంవత్సరం వరుసగా ఎక్కువ రోజులు ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన సినిమాలలో లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది.

ఇక ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొంత కాలం క్రితమే థియేటర్లలో విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి ఎక్కువ షేర్ కలెక్షన్లను కేవలం 13 రోజులు మాత్రమే రాబట్టింది. ఈ విధంగా చూసుకుంటే కల్కి సినిమా వరుసగా ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టిన సినిమాల లిస్టులో హనుమాన్ దరి దాపుల్లోకి కూడా రాలేకపోయింది.

మరి ఈ సంవత్సరం హనుమాన్ సినిమా ఈ రికార్డును ఏ మూవీ అయినా దాటేస్తుందేమో చూడాలి. ఈ సంవత్సరం విడుదల అయిన సినిమాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక కోటి కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను రాబట్టిన సినిమాల లిస్టులో 3 వ స్థానంలో మహేష్ బాబు హీరోగా శ్రీ లీల , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: