బాక్స్ ఆఫీస్ దగ్గర చిరు , బాలయ్య లాంటి స్టార్ హీరోలు పోటీ పడితే ఆ పోటీలో ఎవరు గెలుస్తారా అని చాలామంది ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఈమేజ్ కలిగిన ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే కెరియర్లో కొన్ని సార్లు పోటీ పడ్డారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య మూడు సార్లు సంక్రాంతి పోరు జరిగింది. మరి అందులో ఎవరు గెలిచారు అనే వివరాలను తెలుసుకుందాం.

2001 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన మృగరాజు , బాలయ్య హీరోగా రూపొందిన నరసింహ నాయుడు సినిమాలు విడుదల అయ్యాయి. ఇక ఈ రెండు మూవీ లు కూడా భారీ అంచనాల నడమే విడుదల అయిన మృగరాజు సినిమాకు మాత్రం ఫ్లాప్ టాక్ రాగా , నరసింహ నాయుడు సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఆ సంక్రాంతి కి బాలయ్య సంక్రాంతి విన్నర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత వీరిద్దరూ సంక్రాంతి పండుగ కు చాలా సంవత్సరాల పాటు పోటీ పడలేదు. 2016 వ సంవత్సరం చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదల కాగా , ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య హీరోగా రూపొందిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా విడుదల అయ్యింది. ఇక ఖైదీ నెంబర్ 150 మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా , గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ మంచి విజయాన్ని అందుకుంది. 

సంక్రాంతి కి చిరంజీవి విన్నర్ గా నిలిచాడు. ఇక 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా చిరంజీవి హీరోగా రూపొందిన వాల్టేరు వీరయ్య , బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో వాల్టేర్ వీరయ్య బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోగా , వీర సింహా రెడ్డి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ చివరగా ఈ సంవత్సరం కూడా చిరంజీవి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇలా ఈ వీరిద్దరూ మూడు సార్లు సంక్రాంతి కి పోటీ పడగా అందులో రెండు సార్లు చిరంజీవి , ఒక సారి బాలయ్య పై చేయి సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: