నటుడు సందీప్ కిషన్ అంటే తెలియని వారు ఉండరు. ఈయన ఎన్నో హిట్ సినిమాలు చేస్తూ టైర్ -2 హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు. అయితే ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా చేస్తున్నారు. హైదరాబాదులో ఈయనకు ఓ పెద్ద రెస్టారెంట్ ఉంది. అలా బిజినెస్ లు సినిమాలు అంటూ రెండు చేతులా సంపాదిస్తున్న సందీప్ కిషన్ గురించి టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో ఓ రూమర్ గట్టిగా వినిపిస్తోంది.అదేంటంటే..సందీప్ కిషన్ ఆ కుర్ర బ్యూటీతో ప్రేమలో పడిపోయారనే విషయం గురించే ప్రస్తుతం టాలీవుడ్ లోని చాలామంది గుసగుసలు పెట్టుకుంటున్నారు. మరి ఇంతకీ సందీప్ కిషన్ ని ప్రేమలో పడేసిన ఆ కుర్ర బ్యూటీ ఎవరో ఇప్పుడు చూద్దాం.. 

వెంకటాద్రి ఎక్స్ప్రెస్,  బీరువా, జోరు, తెనాలి రామకృష్ణ బి ఏ బి ఎల్, రోటీన్ లవ్ స్టోరీ వంటి ఎన్నో సినిమాల్లో హీరోగా చేసిన సందీప్ కిషన్ రీసెంట్ గా కోలీవుడ్ హీరో ధనుష్ రాయన్ మూవీ లో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమా కంటే ముందు ఊరి పేరు భైరవకోన అనే మూవీతో హిట్ కొట్టారు సందీప్ కిషన్. అయితే అలాంటి సందీప్ కిషన్ టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న వర్ష బొల్లమ్మ పై మనసు పడ్డారని,ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఏదో సంథింగ్ నడుస్తోందని టాలీవుడ్ మీడియా కొడై కూస్తుంది. ఇక వీరి కాంబినేషన్ లో వచ్చిన ఊరి పేరు భైరవకోన సినిమాలో ఇద్దరి కెమిస్ట్రీ ఎంతో అద్భుతంగా ఉంది.

ఈ సినిమాలో వీరి కాంబోలో వచ్చిన పాటలు కూడా మూవీకి హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీతో ఇద్దరి మధ్య ఏదో నడుస్తోంది అనే టాక్ టాలీవుడ్ లో జోరందుకుంది. దాంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ సందీప్ కిషన్ నిజంగానే ఆ కుర్ర బ్యూటీ తో cప్రేమలో పడిపోయారా అంటూ కామెంట్లు పెడుతున్నారు..మరి  ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న రూమర్ లో ఎంత నిజం ఉంది అనేది మాత్రం తెలియదు.


మరింత సమాచారం తెలుసుకోండి: