టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ కలిగిన బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్యకు అదిరిపోయే రేంజ్ విజయాలను అందించిన కొంత మంది దర్శకులు జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రం అపజయాలను అందించారు. వారు ఎవరు ..? ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

నందమూరి నట సింహం బాలకృష్ణ కు అద్భుతమైన విజయాలను అందించిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. బాలయ్య బి గోపాల్ కాంబినేషన్లో మొత్తం ఐదు సినిమాలు వచ్చాయి. వీరి కాంబినేషన్లో మొదటగా లారీ డ్రైవర్ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత విరి కాంబోలో రౌడీ ఇన్ స్పెక్టర్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వీరి కాంబో లో వచ్చిన సమరసింహా రెడ్డి , నరసింహ నాయుడు మూవీ లు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. ఆఖరుగా వీరి కాంబో లో పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా వచ్చింది. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇక బి గోపాల్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అల్లరి రాముడు , నరసింహుడు అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. 

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకున్నాయి. ఇక బాలకృష్ణ కు అద్భుతమైన విజయాలను అందించిన దర్శకులలో బోయపాటి శ్రీను ఒకరు. బోయపాటి శ్రీను , బాలకృష్ణ తో మొదట సింహ మూవీ ని రూపొందించగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ జానీ బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఆ తర్వాత బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను లెజెండ్ , అఖండ అనే సినిమాలను రూపొందించగా ఈ మూడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ అందుకున్నాయి. బోయపాటి జూనియర్ ఎన్టీఆర్ హీరో గా దమ్ము అనే మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: