విజయ్ దళపతి అంటే కోలీవుడ్ లో మినిమం గ్యారెంటీ కలెక్షన్స్ రాబట్టే కమర్షియల్ హీరో. రజనీకాంత్ తర్వాత అంతటి ఫాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు విజయ్. మినిమం యావరేజ్ టాక్ తోనే ఆయన సినిమాలు రూ.200 కోట్లు కొల్లగొడుతూ ఉంటాయి. అయితే సినిమాల పరంగా మంచి ఫామ్ లోనే ఉన్న విజయ్ దళపతి గత కొంతకాలంగా సొంతంగా రాజకీయ పార్టీ పెట్టి తమిళనాట ప్రజలకు సేవ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇటీవలే తన పార్టీ పేరు, జెండా, ఎజెండాను కూడా ప్రకటించేశారు. ిక రాజకీయాలలోకి శాశ్వితంగా వెళ్లిపోతారు..విజయ్ నటించిన ఆఖరి సినిమా ది గోట్ అని ప్రచారం జరగడంతో ఈ సినిమా విడుదలకు ముందు నుంచే మంచి హైప్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా జరిగాయి.ఇదిలావుండగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజ‌య్ ద‌ళ‌ప‌తి న‌టించిన 'గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) గురువారం (5 సెప్టెంబర్ 2024న) విడుదలైంది. తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించ‌గా, వారిలో పాటు భారీ తారాగ‌ణంతో నిర్మించారు. ప్రస్తుతం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్న ఈ సినిమా ప్రేక్షకులు-విమర్శకుల నుండి సానుకూల రివ్యూల‌ను అందుకుంటుంది. ప్రత్యేక ఉగ్రవాద నిరోధక దళంలో గాంధీ అనే గూఢచారి ఏజెంట్ తన పదవీ విరమణ చేసిన సంవత్సరాల తర్వాత సవాళ్లను ఎదుర్కొంటాడు. 

2004లో జరిగిన మాస్కో మెట్రో బాంబింగ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.విజయ్ మొదట గాంధీగా, తర్వాత కొడుకుగా ద్విపాత్రాభినయంతో అద‌ర‌గొట్టాడు. గోట్  సినిమాలోని స్టార్ కాస్ట్‌లో మీనాక్షి చౌదరి, ప్రశాంత్ త్యాగరాజన్, ప్రభుదేవా, మోహన్ కీలక పాత్రలు పోషించారు. సాక్‌నిల్క్ నివేదిక ప్రకారం, ఈ చిత్రం తొలిరోజు భార‌త్ తో దాపు రూ.55 కోట్ల నికరాన్ని రాబట్టింది. అయితే, దళపతి విజయ్ నటించిన గోట్ సినిమా చూసేందుకు నటుడు కూల్ సురేష్ మేకను తీసుకొని థియేటర్ కు వచ్చారు. దీంతో ఆయనను ప్రేక్షకులంతా విచిత్రంగా చూశారు. అయితే గోట్ సినిమాను సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేకను తీసుకువచ్చాను,అని ఆయన మీడియాకు తెలిపారు.ఇదిలావుండగా 'గోట్' సినిమా విజ‌య్ కెరీర్ లో చాలా ప్ర‌త్యేకం. ఎందుకంటే ఈ సినిమా విడుద‌ల‌కు ముందు ఆయ‌న రాజ‌కీయ పార్టీని ప్ర‌క‌టించారు. పూర్తిగా రాజ‌కీయాల్లో ఉండ‌టంతో ఇదే ఆయ‌నకు చివ‌రి చిత్రం అనే టాక్ కూడా న‌డుస్తోంది. దీంతో అన్ని వ‌ర్గాల నుంచి ఆసక్తిని పెంచింది. ఇప్పుడు థియేట‌ర్ల‌లో మంచి టాక్ తో గోట్ మూవీ న‌డుస్తోంది. రికార్డు క‌లెక్ష‌న్లు సాధిస్తోంది. విజ‌య్ ద‌ళ‌ప‌తి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళ సినిమా చరిత్రలో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించి, AGS ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు భారతదేశం అంతటా రూ. 55 కోట్లు రాబట్టి, తమిళ చిత్రాలకు కొత్త బెంచ్‌మార్క్‌ని నెలకొల్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: