నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. హనుమాన్ సినిమాతో సెన్సెషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య నటవారసుడిని వెండితెరకు పరిచయం చేయనున్నాడు. కొన్ని రోజులుగా సింబా వచ్చేస్తున్నాడంటూ #PVCU అంటూ నందమూరి అభిమానులలో క్యూరియాసిటీని పెంచేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తాజాగా మోక్షజ్ఞ కొత్త సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. సింబా ఈజ్ కమింగ్ అంటూ మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని ఆయన లుక్ రిలీజ్ చేశారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అలాగే మొదటి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.క్యూట్ లుక్ లో కనిపిస్తూ.. అందర్నీ మెస్మరైజ్ చేస్తాడు మోక్షజ్ఞ. సింపుల్ గా నడుచుకుంటూ చిన్న సింహం మాదిరి కనిపిస్తున్న మోక్షజ్ఞ లుక్ అదరగొట్టింది అని చెప్పాలి. మోక్షు ఫస్ట్ లుక్ తో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పురాణ ఇతిహాసాల నేపథ్యంలో ఈ చిత్ర కథాశం ఉండబోతున్నట్టు సమాచారం. SLV బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి చ బాలయ్య చిన్న కుమార్తె మతుకుమిల్లి తేజస్విని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.ఇప్పటికే గత  రెండు రోజులుగా ప్రశాంత్‌ వర్మ వరుస పోస్ట్‌లతో మోక్షజ్ఞ  ఎంట్రీ గురించి హింట్ ఇస్తూ వచ్చారు. ‘నా యూనివర్స్‌ నుంచి త్వరలోనే ఓ కొత్త తేజస్సు రానుంది’, ‘వారసత్వాన్ని ముందుకుతీసుకెళ్లే అద్భుత క్షణం’ అంటూ వరుస పోస్ట్‌లు పెట్టారు. తాజాగా మోక్షజ్ఞ లుక్‌ను పంచుకొని తన తర్వాత సినిమా హీరో అంటూ బాలయ్య వారసుడిని పరిచయం చేశారు. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌  నుంచి రెండో ప్రాజెక్ట్‌గా రానున్న సినిమాలో మోక్షజ్ఞ నటించనున్నాడు.ఇక ఇండస్ట్రీలోకి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి  కొడుకుగా రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో స్టార్ డమ్ తెచ్చుకోగా, నాగార్జున కొడుకు నాగ చైతన్య సైతం టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా నిలిచాడు. అలాగే బాలయ్య కొడుకు హీరోగా ఎలాంటి స్టార్ డమ్ తెచ్చుకుంటాడా అని తెగ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు బాలయ్య అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: