బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు అంటూ.. సోషల్ మీడియాలో వార్తలకే పరిమితం అయ్యారు కాని..మోక్షజ్ఞను తెరపై చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా అని.. ఏకంగా బాలయ్యే కొన్నిసందర్భాల్లో చెప్పారు. చెప్పినట్టు కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. అంతే కాదు మోక్షజ్ఞ లుక్ కూడా చేంజ్ అవ్వడం.. కొత్త ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ లో ఆశలు మళ్ళీ చిగురించాయి. గతంలో మోక్షజ్ఞకు.. ఇప్పటి మోక్షజ్ఞ చాలా తేడా ఉంది. ఆయన లుక్ కంప్లీట్ గా మార్చేశాడు. రీసెంట్ గా ఆయన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో నందమూరి నటసింహం నందమూరి బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా లాంచ్ అవ్వడం కోసం బాలయ్య అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. మరి దాదాపు దశాబ్ద కాలానికి పైగానే వారంతా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఎట్టకేలకి వారి నిరీక్షణకు తెర పడింది.నేడు తన పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోనే హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్టుగా ఇప్పుడు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించేసారు. మరి హను మాన్ దర్శకుడు తమ సినిమాటిక్ యూనివర్స్ లోకి మోక్షు ని ఆహ్వానిస్తూ తనపై ఒక స్టైలిష్ పోస్టర్ ని పెట్టి విష్ చేసాడు.అలాగే ఈ చిత్రాన్ని దసరా నిర్మాణ సంస్థ ఎస్ ఎల్ వి సినిమాస్ వారు అలాగే మోక్షజ్ఞ సోదరి నందమూరి తేజస్వినిలు నిర్మాణం వహిస్తుండడం విశేషం. మరి ఈ క్రేజీ కాంబినేషన్ లో తమ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఏ తరహా సినిమా రానుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా సినీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి మోక్షజ్ఞకు ఆయన సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నటనలో తాతగారిలా పేరు తెచ్చుకోవాలి.ఆయన ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి."హ్యాపీ బర్త్డే మోక్షు" అని తారక్ స్వాగతం పలుకుతూ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ స్పందనతో నందమూరి ఫ్యాన్స్ కృషి అవుతున్నారు.కాగా "తాత గారి ప్రతిష్ట నిలబెట్టే ఎత్తుకు నువ్వు ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా"అని కళ్యాణ్ రామ్ కూడా పోస్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: