డైరెక్టర్గా నటుడుగా పేరుపొందిన ఎస్ జె సూర్య మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ఇండియాలోనే బెస్ట్ యాక్టర్ గా పేరు సంపాదిస్తూ ఉన్నారు సూర్య. ముఖ్యంగా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పిస్తూ ఉన్నారు. ఇటీవలే నాని నటించిన సరిపోద శనివారం అనే చిత్రంలో కూడా అద్భుతమైన విలన్ గా నటించారు. ఈ సినిమా చూసిన వారంతా కూడా ఎస్ జె సూర్య నటన గురించి మాట్లాడుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నాని కంటే ఎస్ జె సూర్య పాత్ర  డామినేట్ చేసేలా ఉందని హీరో నానిని స్వయంగా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది.


సరిపోద శనివారం సినిమా సక్సెస్ మీట్ లో భాగంగా ఎస్ జె సూర్య మాట్లాడుతూ షూటింగ్లో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ఈ సినిమాలో సీనియర్ నటుడుగా ఉన్న శివాజీ రాజా నటించారని.. ఈ సినిమా చివరిలో శివాజీ రాజా చేతిలో ఎస్ జె సూర్య దెబ్బలు తినే సన్నివేశం ఉన్నదట.. అయితే ఈ సీన్ పైన ఎస్ జె సూర్య మాట్లాడుతూ.. ఈ చిత్రంలో శివాజీ రాజా గారి చేతిలో తాను చెంప దెబ్బలు తినే సిన్ ఉన్నది ఇది మామూలుగానే ఊరికే కొట్టేలా తీశారని తెలిపారు.


కానీ డైరెక్టర్ సరిగ్గా రాలేదని.. డైరెక్టర్ వివేక్ వచ్చి తనని నిజంగానే దెబ్బలు తినగలరా అని అడిగారు అందుకు తాను కూడా ఓకే అని చెప్పాను.. శివాజీ రాజా గారిని పిలిచి మరి గట్టిగా కొట్టండి సార్ పర్వాలేదు అని చెప్పాను.. ఆయన ఒక్కకోట్టుడు కొట్టాడు దీంతో దవడకు గట్టిగా తగిలింది అంటూ తెలిపారు. తాను తేలుకోవడానికి కాస్త సమయం పట్టిందని తెలియజేశారు ఎస్ జె సూర్య. అయితే ఆ తర్వాత శివాజీ రాజా  గారినీ పిలిచి ఒకసారి మీ చేయి చూపించండి అని అడిగితే తాను కరాటేలో బ్రౌన్ బెల్ట్ అని చెప్పారని అయితే ఈ విషయం తనకు తెలియదని.. ఆ తర్వాత మళ్లీ రీటెక్ తనకోసం చేయించారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: