బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఘనంగా ప్రారంభమైంది. నాగార్జున హోస్టింగ్ తో స్వాగతం చెప్తుండగా కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ గా తమ పర్ఫార్మెన్స్ లతో ఎంట్రీ ఇచ్చారు. అయితే  బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో పదో కంటెస్టెంట్ గా నటుడు నాగ మణికంఠ ఎంట్రీ ఇచ్చాడు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు నాగ మణికంఠ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ యువ నటుడు బిగ్ బాస్ ఆఫర్ రావడంతో కెరీర్ కి ఉపయోగపడుతుందని హౌస్ లోకి వచ్చేసాడు. అయితే తాజాగా నామినేషన్స్ అనంతరం నాగ మణికంఠ ఏడుస్తూ తన విగ్గు తొలగించాడు. ఇంతకంటే నేను

 ట్రాన్సపరెంట్ గా ఉండలేను బిగ్ బాస్. బయటకు వెళ్ళాక నా జీవితం ఏమవుతుందో తెలియదు… అంటూ విగ్గు తీసి విసిరేశాడు. పక్కనే ఉన్న కంటెస్టెంట్స్ అతన్ని ఓదార్చారు. నాగ మణికంఠ విగ్గు తొలగించడం పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.కొందరు రివ్యూవర్స్ సైతం అతనిపై ఎగతాళి పూర్వక కామెంట్స్ చేస్తున్నారు. కాగా మణికంఠను ట్రోల్ చేయడాన్ని గీతూ రాయల్ ఖండించింది. విగ్గు ధరిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నవారు అందంగా కనిపించాలని అనుకుంటారు. అందుకే మణికంఠ పూర్తి విగ్గు కూడా కాదు, ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. మహేష్ బాబుకి కూడా జుట్టు తక్కువగా

 ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారని.. గీతూ రాయల్ అన్నారు. మణికంఠ వివాదంలోకి ఎలాంటి సంబంధం లేని మహేష్ బాబు పేరును తేవడాన్ని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.  ఇకపోతే గీతూ రాయల్ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె బిగ్ బాస్ తెలుగు సీజన్ 6లో కంటెస్ట్ చేసింది. హౌస్లో గీతూ రాయల్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది. అంతేకాకుండా ఆమె బిగ్ బాస్ సీజన్ 7 బజ్ కి హోస్ట్ గా వ్యవహరించింది. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూలు చేసింది. ఫినాలే నాడు గీతూ రాయల్ కారుపై దాడి జరిగింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: