వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన ‘ది గోట్ నిన్న (సెప్టెంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఫుల్ టైమ్ పబ్లిక్ సర్వెంట్‌గా మారనున్న విజయ్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనుండడంతో ‘ది గోట్’పై అభిమానుల్లో మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. డ్యాన్సులు, పాటలు, బాణాసంచా పేలుళ్లు, పాలాభిషేకాలతో విజయ్ అభిమానులు ‘ది కోడ్’ విడుదలను పండుగలా జరుపుకున్నారు. విజయ్ నటించిన ‘ది గోట్’ ఒక్క తమిళనాడులోనే మొత్తం 1,100 థియేటర్లలో విడుదలైంది. ఇదిలా ఉంటే ది గోట్‌కు వస్తోన్న రెస్పాన్స్ నాని నటించిన సరిపోదా శనివారం  వసూళ్లకు

 కలిసొచ్చేలా కనిపిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్‌లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ వీకెండ్‌ వినాయక చవితి నేపథ్యంలో ఏపీ, తెలంగాణ సినీ జనాలకు సరిపోదా శనివారం ఫస్ట్ చాయిస్ అవనుంది. తారక్ నటించిన దేవర రిలీజ్‌కు కూడా ఇంకా టైం ఉండటంతో.. అప్పటివరకు సోలోగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇన్‌ సైడ్‌ టాక్‌. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సరిపోదా శనివారంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య  నెగెటివ్ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషిస్తోంది. ది గోట్‌లో విజయ్‌ తండ్రీకొడుకులుగా డ్యుయల్ రోల్‌లో

 నటించగా.. ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, వీటీవీ గణేశ్‌, అజ్మల్ అమీర్‌, మనోబాల ఇతర కీలక పాత్రలు పోషించారు.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గతంలో  వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేశారు. సరిపోదా శనివారం ఆగస్టు 29 న థియేటర్ లో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: