సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గుంటూరు కారం సినిమాతర్వాత మహేష్ బాబు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా కథ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ కు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ బాబు సినిమా బడ్జెట్ దాదాపు 1000 కోట్లు అని అంటున్నారు. ఇది పాన్ వరల్డ్ సినిమా అని టాక్. అలాగే పలువురు

 అంతర్జాతీయ స్టార్స్ కూడా ఇందులో నటించనున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు సినిమాను త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.  ఇదిలవుండగా తాజాగా రాజమౌళి టీమ్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం అక్టోబరు 10న రాజమౌళి పుట్టినరోజు కి ssmb 29 కి సంబందించిన న్యూస్ ఏదో ఒక అప్ డేట్ ఉంటుంది. ఈ నెల చివరాఖరి నుండి యూనిట్ సభ్యులు అందరు వర్క్ షాప్ లో పాల్గొంటారని టాక్. డిసెంబరు నుండి పక్కాగా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫస్ట్ షెడ్యూల్ ను విదేశాల్లో మొదలెట్టనున్నారు. ఫారిన్ లోని అడవులలో భారీ చేజింగ్ సిక్వెన్స్ ను

 చిత్రీకరించనున్నారు. మరోవైపు ఈ సినిమాకు gold అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రంలో మహేశ్ సరసన నటించబోయే హీరోయిన్, అలాగే విలన్ ఎవరనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో గట్టిగా ఉంది. అత్యంత భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన లుక్ లో మారేందుకు రెడీ అవుతున్నాడు అందుకోసం బాడీ, గడ్డం పెంచబోతున్నాడు మహేశ్ బాబు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: