బన్నీ ఫుల్ ఫోకస్ మొత్తం పుష్ప 2 మీదే పెట్టారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పుష్ప 2 ఆల్రెడీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చెయ్యాల్సిన టీమ్ ఇంకా రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ చేస్తూనే ఉంది. పుష్ప 2 డిసెంబర్ 6న రిలీజ్ కానుంది. దాదాపు 3 ఏళ్లనుంచి పుష్ప 2 తోనే బన్నీ ఎంగేజ్ అయి ఉన్నారు కాబట్టి పుష్ప రిలీజ్ అయ్యాక గ్యారంటీగా బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా రావడంతో పుష్ప 2 మీద ఆల్ ఓవర్ ఇండియా విపరీతమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. అదీకాక సినిమాలో కరెక్షన్లు, ఓవర్ హైప్ వల్ల ప్రతీ చిన్న

 డీటెయిల్ ని కేర్ ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు సుకుమార్ అండ్ టీమ్. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు బద్దలుకొడుతున్నాయి. అందుకే ఈ హైప్ ని అందుకోవడానికే బన్నీ పుష్ప 2 మీదే ఫోకస్ చేస్తున్నారట.  ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక వైపు షూటింగ్ కొనసాగిస్తూనే ఎడిటింగ్ వర్క్స్ కూడా సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నారంట. పుష్ప సినిమాలోని ఊ అంటావా తరహాలో పుష్ప 2లో కూడా ఒక స్పెషల్ సాంగ్

 ఉండబోతోందంట. అక్టోబర్ లేదా నవంబర్ లో ఈ సాంగ్ షూట్ ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం లీడ్ యాక్టర్ ని ఎంపిక చేయడం పైన సుకుమార్ టీమ్ ఫోకస్ చేసారంట. అయితే ఈ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దానిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ముందుగానే థర్డ్ సింగిల్ గా ఈ పాటని రిలీజ్ చేస్తారా లేదంటే షూట్ అయ్యాక డాన్స్ వీడియో షాట్స్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారా అనేది వేచి చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: