కన్నడ భామ శ్రీలీల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయమైంది ఈ భామ. ఈ సినిమాతో శ్రీలీల పెద్దగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మంచి అవకాశాలే వచ్చాయి. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ బ్యూటీతో సినిమాలు చేయడానికి దర్శకులు క్యూలో నిలబడ్డారు.

చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్క హీరో శ్రీలీలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించారు. రవితేజ, వైష్ణవ్ తేజ్, నితిన్, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి ఎందరో హీరోల సరసన ఆడి పాడింది. వచ్చిన ప్రతి ఒక్క సినిమా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇండస్ట్రీలో శ్రీలీల హవా చూసిన ప్రతి ఒక్కరూ స్టార్ హీరోయిన్ గా సెటిల్ అవుతుందని అనుకున్నారు కానీ ఊహించని విధంగా ఈ భామ టాలీవుడ్ పరిశ్రమకు దూరమైంది.


శ్రీలీల కెరీర్ లో ఒక్క ధమాకా సినిమా తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా పడలేదు. తాజాగా శ్రీలీల తమిళ స్టార్ హీరో విజయ్ సినిమా నుంచి తప్పుకొని అందరికీ షాక్ ఇచ్చింది. విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని సంప్రదించారట. దీంతో శ్రీలీల స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చింది కదా అని సాంగ్ చేయాలని అనుకుందట. ఆ తర్వాత ఏమైందో తెలియదు మళ్ళీ చేయనని చెప్పిందట.

తమిళంలో యంగ్ హీరోల సరసన నటిస్తున్న శ్రీలీల ఇలాంటి సమయంలో ఐటమ్ సాంగ్స్ లో నటించడం సరికాదని కొందరు సూచనలు చేశారట. దీంతో గోట్ సినిమాలో ఐటమ్ సాంగ్ ను శ్రీలీల రిజెక్ట్ చేసింది. ఈ విషయం తెలిసిన వారంతా స్టార్ హీరో సినిమాలో అవకాశం వస్తే అలా వదులుకోవడం సరికాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: